Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోగ్గాడు సీక్వెల్ : మన్మథుడు సరసన శివగామి

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (10:02 IST)
టాలీవుడ్ 'మన్మథుడు'తో 'బాహుబలి' శివగామి మరోమారు జతకట్టనుంది. గత 2016 సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులను ఆలరించిన "సోగ్గాడే చిన్ని నాయనా" చిత్రం రెండోభాగం రానుంది. ఇందులో అక్కినేని నాగార్జున సరసన రమ్యకృష్ణ జతకట్టనుంది. 
 
సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నాగార్జున బంగార్రాజు అనే పాత్రలో ఆలరించారు. ముఖ్యంగా, డబుల్ షేడ్స్‌లో నటించి మెప్పించాడు. ఫలితంగా నాగ్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాదించిన చిత్రంగా నిలిచిపోయింది. 
 
రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్‌లుగా నటించగా, ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు గ‌తంలోనే వార్త‌లు వ‌చ్చాయి. సీక్వెల్‌కు బంగార్రాజు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నామ‌ని అన్నారు. 
 
సీక్వెల్‌కి సంబంధించి క‌ళ్యాణ్ కృష్ణ కొద్ది రోజులుగా స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తుండ‌గా, ఇటీవ‌ల క‌థ‌ని నాగ్‌కి వినిపించార‌ట‌. అయితే ఆ క‌థ‌లో కొన్ని మార్పులు చేసి స్టోరీని ఓ కొలిక్కి తెచ్చార‌ని అంటున్నారు. క‌థ మొత్తం బంగార్రాజు చుట్టూనే తిర‌గ‌నుండ‌గా, ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ట‌. ఇక నాగ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ర‌మ్య‌కృష్ణ‌ని ఎంపిక చేశార‌ని అంటున్నారు. 
 
ఈ చిత్రం నాగ చైతన్య కూడా ఓ చిన్నపాత్రను పోషించనున్నాడట. ఆయ‌న‌కి జోడీగా ఎవరిని ఎంపిక చేయాలా అని చిత్ర‌బృందం క‌స‌ర‌త్తులు చేస్తుంద‌ట‌. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. నాగ్ చివ‌రిగా 'దేవ‌దాస్' అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments