Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్ళి కాకుండానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన యువతి.. ఎక్కడ?

Advertiesment
Acharya Nagarjuna University
, శుక్రవారం, 14 డిశెంబరు 2018 (19:44 IST)
విజయవాడలోని నాగార్జున యూనివర్సిటీలో 20 యేళ్ళ యువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా క్యాంపస్‌లో ఉన్న ప్రథమ చికిత్సా కేంద్రంలోనే. కడుపునొప్పితో వచ్చిన యువతికి మగబిడ్డ పుట్టడంతో ఆశ్చర్యపోయారు సహచర విద్యార్థులు. 
 
గత నాలుగు నెలల నుంచి యువతి కడుపు నొప్పి అని మందులను వాడుతోంది. అయితే నిన్న రాత్రి కడుపు నొప్పి ఎక్కువ కావడంతో నేరుగా యూనివర్సిటీలోని ప్రథమ చికిత్సా కేంద్రానికి వెళ్ళింది. అక్కడున్న నర్సు యువతి పొట్ట పెద్దదిగా ఉండటాన్ని గమనించింది. కొద్దిసేపటికి పురుటి నొప్పులతో బాధపడుతూ ఉండగా బెడ్‌పై యువతిని పడుకోబెట్టారు. వెంటనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది యువతి. 
 
అయితే యువతి తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు యూనివర్సిటీ యాజమాన్యం. తనకు బిడ్డ పుట్టడానికి ఎవరు కారణమన్న విషయాన్ని ఆ యువతి అటు తల్లిదండ్రులకు గానీ, స్నేహితులకు గానీ చెప్పలేదట. కాగా సదరు యువతి హాస్టలులోనే వుండి చదువుకుంటోంది. అలాంటప్పుడు ఆమె బయటకు వెళ్లే అవకాశం లేదు. కానీ ఇది ఎలా జరిగిందన్నది ఆశ్చర్యంగా వుంది. కాగా బిడ్డతో పాటు తమ కూతురిని ఆమె తల్లిదండ్రులు తీసుకుని వెళ్లారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జస్ట్ మ్యారీడ్... ఒకటైన సైనా నెహ్వాల్-పారుపల్లి కశ్యప్