Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో విశాల్ పైకి మాత్రమే హీరో... వాస్తవానికి పెద్ద విలన్ : రమ్య

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (17:43 IST)
తెలుగు, తమిళ హీరో విశాల్‌పై ఆయన ప్రొడక్షన్ ఆఫీసులో పని చేసే రమ్య అనే మహిళ సంచలన ఆరోపణలు చేసింది. విశాల్ పైకి మాత్రమే హీరో అని, వాస్తవానికి పెద్ద విలన్ అని ఆరోపించింది. అందుకు సంబంధించిన ఎన్నో ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించింది.
 
గత వారంలో తన ప్రొడక్షన్ హౌస్‌లో ఆరేళ్లుగా పనిచేసిన రమ్య అనే మహిళ, దాదాపు రూ.45 లక్షలు కాజేసిందని హీరో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌లో మేనేజరుగా పని చేసే హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హీరోగానే కాకుండా, నిర్మాతగానూ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమాలు తీస్తున్న ఆయన, హరి, రమ్య అనే ఇద్దరిని ఉద్యోగులుగా నియమించుకోగా, ఇరువురూ కలిసి ఆరేళ్ల వ్యవధిలో లక్షల డబ్బు కొట్టేశారన్నది విశాల్ అభియోగం.
 
ఈ ఆరోపణలపై రమ్య ఘాటుగా స్పందించింది. పైకి హీరోలా కనిపించే విశాల్, వాస్తవానికి పెద్ద విలన్ అని, తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, తన వద్ద ఉన్న వివరాలన్నీ చెబితే, విశాల్ నిజస్వరూపం బయట పడుతుందని హెచ్చరించింది. తాను ఎవరినీ మోసం చేయలేదని స్పష్టం చేసిన ఆమె, మహిళను కావడం వల్లే బెదిరిస్తున్నారని వాపోయింది.
 
తాను ఇంతకాలమూ ఎంతో సైలెంట్‌గా ఉన్నానని, ఇప్పుడు తనపైనే ఆరోపణలు వచ్చాయి కాబట్టి, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని, దాంతో విశాల్ విషయం అందరికీ తెలుస్తుందని వ్యాఖ్యానించింది. 
 

సంబంధిత వార్తలు

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments