Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇట్స్ కన్ఫార్మ్ : జెర్సీ మూవీ దర్శకుడుతో హీరో చెర్రీ చిత్రం

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (10:33 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ వంటి భారీ ప్రాజెక్టులో ఆయన నటిస్తున్నారు. అలాగే, తన తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య మూవీలో ఓ అతిథి పాత్రను పోషిస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. తాజాగా జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటించేందుకు సమ్మతించారు. 
 
ఈ ప్రాజెక్టుపై విజయదశమి పండుగ పూట ఎట్ట‌కేల‌కు ఓ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. 'నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ వ‌చ్చింది' అని చెర్రీ ప్రకటన చేశారు. యూవీ క్రియేష‌న్స్ కూడా త‌మ ట్విట్టర్ ద్వారా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేసింది.
 
'మ‌ళ్ళీరావా' వంటి సినిమాతో పెద్ద హిట్ త‌ర్వాత నానితో క‌లిసి గౌత‌మ్ తిన్న‌నూరి 'జెర్సీ' చేశాడు. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డ‌మేకాక ప‌లు అవార్డులు కూడా అందుకుంది. ఎమోష‌న‌ల్ కాన్సెప్ట్ మూవీల‌ను తెర‌కెక్కించ‌డంలో దిట్ట‌గా పేరున్న గౌత‌మ్ తిన్న‌నూరి ఇప్పుడు చ‌ర‌ణ్‌ను ఎలా ప్రెజంట్ చేస్తాడ‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments