గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా RC 16 బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో రామ్‌చరణ్ జతగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో సినిమా తెరకెక్కుతుంది.
బిజినెస్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత వెంకట సతీష్ కిలారుకి సినిమా రంగం అంటే ఎంతో ఆసక్తి. ఆ అభిరుచితోనే ఆయన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి చాలా ఏళ్లుగా ట్రావెల్ అవుతున్నారు. తాజాగా RC 16 వంటి భారీ చిత్రంతో నిర్మాతగా ఆయన పరిచయం అవుతుండటం విశేషం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ బుచ్చిబాబుకి సినిమా అంటే పిచ్చి. రంగస్థలంలో సుకుమార్ అసిస్టెంట్ గా తను ట్రావెల్ అయ్యాడు. రంగస్థలం నెరేషన్‌ను సుకుమార్‌గారు నాకు నలబై నిమిషాలే ఇచ్చారు. అయితే అక్కడి నుంచి ప్రతిరోజూ రెండేసి గంటల నెరేషన్‌ను ఇస్తూ వచ్చింది మాత్రం బుచ్చిబాబునే. తనకు ఇంత పిచ్చి ఉంటుందని నేను అనుకోలేదు. ఈ స్టేజ్ పై ఉన్న ప్రముఖులను చూస్తుంటేనే తన సంకల్పం ఏంటో అర్థమవుతుంది. సుకుమార్ గారి దగ్గరున్న టీమ్ లో బుచ్చిబాబు బెస్ట్. తను ఉప్పెనతో పెద్ద సక్సెస్ చూశాడు. నేను నాకెరీర్‌లో ఇంత త్వరగా ఎ.ఆర్.రెహమాన్‌గారితో పని చేస్తానని అనుకోలేదు. కచ్చితంగా అద్భుతమైన సినిమా చేస్తామనే నమ్మకం ఉంది. నేను, జాన్వీ కలిసి జగదేకవీరుడు-అతిలోక సుందరి అనే సినిమా చేయాలని చాలా మంది అనుకున్నారు. మా కాంబినేషన్ ఈ సినిమాతో నిజం కాబోతుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా జాన్వీకి థాంక్స్. మా సూపర్ హిట్ ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్‌కి, నిర్మాత సతీస్ కిలారుకి, మా టెక్నికల్ టీమ్‌కి థాంక్స్ అన్నారు.