Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వినూత్నంగా రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

charan celebrations poster

డీవీ

, బుధవారం, 13 మార్చి 2024 (12:30 IST)
charan celebrations poster
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఇంకా పధ్నాలుగు రోజులలో చెర్రీ 39 ఏట అడుగు పెట్టనున్నాడు. ఇప్పటికే చెర్రీ పుట్టినరోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల అభిమానులు మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ప్రారంభించారు. గత ఏడాది అదే రోజున చరణ్ తాజా సినిమా గేమ్ ఛేంజర్  సెట్స్‌లో టీమ్‌తో కలిసి కేక్ కట్ చేశాడు. ఈ వేడుకలకు కియారా అద్వానీ కూడా హాజరయ్యింది. ఇక నేటికీ ఆ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొంత భాగం షూట్ కావాల్సి వుంది.
 
ఇదిలా వుండగా, ఈ ఏడాది చరణ్ జన్మదినవేడుకలు అభిమానులు వినూత్నంగా చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లోకూడా రక్తదానాలు, ఆంజనేయుని స్త్రోత్రాలు పఠించే కార్యక్రమాలు చేపట్టారు. అభిమానుల్ని, రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి సభ్యుల్ని ఈనెల 24 వ తారీఖున ఆదివారం రక్తదాన శిభిరాలు నిర్వహించవలసిందిగా కోరుతున్నట్లు మెగా అభిమాన సంఘం పేర్కొంది.
 
హనుమాన్ ఛాలీసా పఠనం సర్వ మానవాళికి శ్రేయస్కరం.
శ్రీ రామ్ చరణ్ గారి*పుట్టినరోజు నాడు *హనుమాన్ ఛాలీసా పఠనం తో ఆయనకూ... మనకు మంచి జరగాలనే  శుభసంకల్పానికి ఈ మహత్కార్యానికి శ్రీకారం చుడుతున్నాం.
మెగా భక్తులు అందరూ ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొని సనాతన ధర్మాన్ని  రక్షిస్తూ హనుమాన్ ఛాలీసా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం అని  అఖిల భారత చిరంజీవి యువత ప్రకనలో పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళ అర్జున్ రెడ్డితో అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్