మైసూర్ శ్రీ చాముండేశ్వరి ఆలయంలో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు
						
		
			      
	  
	
			
			  
	  
      
								
			
				    		 , సోమవారం,  4 డిశెంబరు 2023 (12:22 IST)
	    	       
      
      
		
										
								
																	RamCharan, Sri Chamundeshwari temple
కార్తీక సోమవారంనాడు అంటే  నేడు మైసూర్‌లోని శ్రీ చాముండేశ్వరి ఆలయంలో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు చాలా శుభదినంగా తిదిలు చెబుతున్నాయి. తెలంగాణ కొత్త సి.ఎం.గా కూడా ఈరోజే నియామకం అనుకున్నారు. కానీ కేంద్ర కమిటీ నిర్ణయం మేరకు వాయిదా వేశారు. ఎందుకు ఈరోజు ప్రత్యేక దినం అంటే కార్తీక మాసంలో వచ్చే సప్తమి నాడు సూర్యుడికి అత్యంతప్రీతి. అందుకే ఈ రోజు ఏ పనిచేసినా విజయం సాధిస్తుందని అంటారు.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
									
										
										
								
																	
		
			RamCharan, Sri Chamundeshwari temple
 ఇక రామ్ చరణ్ తాజా సినిమా “గేమ్ చేంజర్” సూటింగ్ కూడా గత కొద్దిరోజులుగా మూసూర్ పరిసర ప్రాంతాల్లో జరిగింది.  ఈరోజు చిత్ర యూనిట్ కూడా పాల్గొన్నారు. కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది. శంకర్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ తండ్రీ, కొడుకులుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.  కియారా అద్వానీ నాయికగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ భారీ చిత్రం చేయబోతున్నాడు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
 
									
											
							                     
							
							
			        							
								
																	
		
		 
		
				
		
						 
		 
		  
        
		 
	    
  
	
 
	
				       
      	  
	  		
		
			
			  తర్వాతి కథనం