Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా ముందుకు మెగా ప్రిన్సెస్.. ఎవరి పోలికో చెప్పిన చెర్రీ!

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2023 (15:28 IST)
మెగా ప్రిన్సెస్‌ మీడియా ముందుకు వచ్చింది. హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల ఓ అడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఉపాసన సుఖ ప్రసవం కావడంతో ఆమెను శుక్రవారం వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత తన కుమార్తెతో కలిసి చరణ్ - ఉపాసన దంపతులు మీడియా ముందుకు వచ్చారు. అయితే, చిన్నారి ముఖం కనిపించకుండా వస్త్రంతో కప్పి ఉంచారు. 
 
ఈ సందర్భంగా చరణ్ మీడియాతో మాట్లాడుతూ, తల్లి, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. మంచి వైద్య బృందం ఉందని ఎలాంటి సమస్యా లేదని, ఎలాంటి భయం కూడా లేదని చెప్పారు. అభిమానులు చేసిన ప్రార్థనలు చాలా గొప్పవన్నారు. ఇంతకంగా ఆనందం ఏముంటుందని చెప్పారు.
 
బిడ్డకు అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. కుమార్తె ఎవరి పోలిక్ అని మీడియా మిత్రులు అడగ్గా... మరో క్షణం తడుముకోకుండా మా నాన్న పోలికే అని చెర్రీ సమాధానమిచ్చారు. అలాగే, పాపకు ఏం పేరు పెట్టబోతున్నారని అని అడగ్గా.. ఏం పేరు పెట్టాలనేది తాను, ఉపాసన కలిసి నిర్ణయించామని, సంప్రదాయం ప్రకారం 21వ రోజున ఈ పేరును వెల్లడిస్తామని తెలిపారు. బిడ్డను తొలిసారి చూసినపుడు, తాకినపుడు అందరు తల్లిదండ్రుల మాదిరిగానే తాను కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments