Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామాయణ సీరియల్ 'సుగ్రీవుడు' ఇకలేరు

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (19:08 IST)
ఒకపుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ "రామాయణం". ఈ సీరియల్ కొన్ని నెలల పాటు దూరదర్శన్‌లో ప్రదర్శితమైంది. ఇపుడు లాక్‌డౌన్ కారణంగా ఈ సీరియల్‌ను గత నెల 28వ తేదీ నుంచి ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, రాత్రి 9 నుంచి 10 గంటలవరకు ప్రదర్శిస్తున్నారు. ఈ రామాయణ సీరియల్‌లో సుగ్రీవుడు, బాలి పాత్రల్లో నటించిన ప్రముఖ నటుడు శ్యామ్ సుందర్ కాళాని మృతి చెందారు. 
 
ఈ విషయాన్ని ఇదే సీరియల్‌లో రాముడి పాత్రను పోషించిన అరుణ్ గోవిల్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ, శ్యామ్ మృతికి సంతాపం కూడా తెలిపారు. 'రామాయణం' చిత్రంలో సుగ్రీవుడు, బాలిగా ద్విపాత్రాభినయం చేసి ఎంతో పాపుల‌ర్ అయిన‌ శ్యామ్‌సుందర్ కాలానీ కొద్ది కాలంగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ వచ్చిన ఈయన ఈ నెల 7వ తేదీన కల్కాలో తుదిశ్వాస విడిచారు.
 
కాగా, రామాయణం సీరియ‌ల్‌లో లక్ష్మణ్ పాత్ర పోషించిన నటుడు సునీల్ లాహ్రీ, శ్యామ్‌సుందర్ కాలానీ మరణానికి సంతాపం తెలిపారు. 'మా తోటి న‌టుడు శ్యామ్ కలాని ఆకస్మిక మరణం చెందార‌నే వార్త న‌న్ను ఎంత‌గానో బాధించింది. వారి ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను' అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments