బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి విషాదం నెలకొంది. ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ హఠాన్మరణం చెందారు. వయసు 38 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన, సోమవారం రాత్రి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందతూ కన్నుమూశారు.
ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ ధృవీకరించారు. "ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము" అంటూ తన ట్విటర్ ఖాతాతో విషయాన్ని అభిమానులకు చేరవేశారు. అబ్దుల్లా మరణ వార్తను సల్మాన్ జీర్ణించుకోలేక కన్నీరు పెట్టుకున్నారు.
కాగా, అబ్దుల్లా మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా బాడీ బిల్డర్ అయిన అబ్దుల్లా, సల్మాన్‌తో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
నిత్యమూ జిమ్‌కు ఇద్దరూ కలిసే వెళ్లేవారు. గతంలో అబ్దుల్లాతో కలిసి జిమ్ చేస్తున్న అనేక వీడియోలను సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఫ్యాన్స్‌కు షేర్ చేసిన విషయం తెల్సిందే.