Webdunia - Bharat's app for daily news and videos

Install App

మట్కాలో వరుణ్ తేజ్ పై రామ టాకీస్ ర్యాంప్ సాంగ్ రిలీజ్

డీవీ
గురువారం, 7 నవంబరు 2024 (07:28 IST)
Varun tej Ramatakies song
వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా' నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సాంగ్స్, టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.
 
ఈరోజు మేకర్స్ రామ టాకీస్ ర్యాంప్ సాంగ్ రిలీజ్ చేశారు. భవానీ రాకేష్ అదిరిపోయే బీట్స్ తో అడిక్టివ్ ఫోక్ నెంబర్ గా ఈ పాటని కంపోజ్ చేశారు. డైరెక్టర్ కరుణ కుమార్ స్వయంగా రాసిన జానపద సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 
సాయి దేవ హర్ష పెక్యులర్ వోకల్స్ ఈ పాటని మరింత ప్రత్యేకంగా నిలిపింది. హీరో వరుణ్ తేజ్ తో పాటు సినిమాలోని కీలక నటీనటులు, స్పెషల్ సెట్స్, షూటింగ్ లోకేషన్స్ ని ప్రజెంట్ చేసిన సాంగ్ మేకింగ్ వీడియో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ నిలిచింది. విన్నవెంటనే కనెక్ట్ అయ్యే ఈ సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.
 
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.
 
తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ మంతి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments