Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కంద నుంచి రామ్ పోతినేని, శ్రీలీల ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (17:50 IST)
Ram Pothineni, Srileela
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ రామ్‌ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. మేకర్స్ ఇప్పుడు సినిమా మ్యూజికల్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఫస్ట్ సింగిల్ నీ చుట్టు చుట్టు పాట విడుదలైయింది.
 
కంపోజర్ ఎస్ థమన్ మాస్ బీట్‌లతో చాలా రిథమిక్‌గా ఉండే క్రేజీ లిరిక్స్‌తో పెప్పీ, మాస్ ట్యూన్‌ని కంపోజ్ చేశారు. పాట మూడ్  టెంపోను ఎనర్జిటిక్ గా చేశారు. సిద్ శ్రీరామ్, సంజన కల్మంజే   హుషారుగా పాడిన ఈ పాటకు రఘురామ్ రాసిన యూత్‌ఫుల్ లిరిక్స్‌ మరింత ఆకర్షణగా నిలిచాయి.
 
రామ్ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. శ్రీలీల, రామ్‌ ఎనర్జీ ని మ్యాచ్ చేసింది. ఇద్దరూ ఎలిగెంట్, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్‌లతో ఆకట్టుకున్నారు. కాస్ట్యూమ్స్‌, కలర్‌ఫుల్‌ సెట్‌ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.
 
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్,  పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.  తమ్మిరాజు ఎడిటర్.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments