Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరును ఆకాశానికెత్తిన వర్మ.. మెగాస్టార్.. మెగా.. మెగా.. మెగా.. ఫెంటాస్టిక్ అంటూ ట్వీట్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎపుడు ఎలాంటి ట్వీట్ చేస్తారో ఎవరికీ అంతుచిక్కదు. మెగా కాంపౌండ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన ఆర్జీవీ... ఇపుడు ఉన్నట్టుండి పొగడ్తల వర్షం కురిపించాడు. ని

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (09:24 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎపుడు ఎలాంటి ట్వీట్ చేస్తారో ఎవరికీ అంతుచిక్కదు. మెగా కాంపౌండ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన ఆర్జీవీ... ఇపుడు ఉన్నట్టుండి పొగడ్తల వర్షం కురిపించాడు. నిజానికి చిరంజీవి నటించిన తాజా చిత్రం 'ఖైదీ నెం.150' మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో నాగబాబు ఎపీసోడ్ నుంచి మెగాఫ్యామిలికీ వర్మకు మధ్య వేడి వాతావరణం కొనసాగింది. నాగబాబు వ్యాఖ్యలకు కౌంటర్‌గా వరుస ట్వీట్లతో వర్మ విరుచుకుపడ్డాడు. 
 
అయితే ఆ తర్వాత మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ.. వర్మ నాకు అర్థం కాడని అతనిది విభిన్న మనస్తత్వం అంటూ వ్యాఖ్యానించాడు. పవన్‌ కళ్యాణ్‌ను పొగడటం కోసం తనను కించపరచడం ఏం సంస్కారం అని ప్రశ్నించారు. అయితే నాగబాబుకు వరుస కౌంటర్లు ఇచ్చిన వర్మ మెగాస్టార్‌కు మాత్రం కౌంటర్ ఇవ్వలేదు. 
 
తన ట్వీట్ల పరంపరను ఆపేశాడు. అయితే ఇప్పుడు తాజాగా చిరును ఆకాశానికెత్తేశాడు. ఇప్పుడే 150 మూవీ చూశానని, సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పాడు. 9 సంవత్సరాల క్రితం సినిమాలను వదిలేసినప్పటి కంటే ఇప్పుడు మరింత యవ్వనంగా ఉన్నారని ట్వీట్ చేశాడు. తన ఎనర్జీ లెవల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయంటూ ఆకాశానికెత్తేశాడు వర్మ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments