Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందంగా ఉన్నావ్.. నా కోర్కె తీరిస్తే సినీ ఛాన్సిస్తా... బీబీఎం విద్యార్థినిపై చెన్నై ఎక్స్‌ప్రెస్ నిర్మాత లైంగిక దాడి

హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థిని బాలీవుడ్ నిర్మాత చేతిలో మోసపోయింది. ఫలితంగా తన శీలాన్ని కోల్పోయింది. సినీ ఛాన్స్ ఇప్పిస్తానని నమ్మించిన ఆ బాలీవుడ్ నిర్మాత... బీబీఎం విద్యార్థినిపై పలుమార్లు లైంగికద

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (08:29 IST)
హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థిని బాలీవుడ్ నిర్మాత చేతిలో మోసపోయింది. ఫలితంగా తన శీలాన్ని కోల్పోయింది. సినీ ఛాన్స్ ఇప్పిస్తానని నమ్మించిన ఆ బాలీవుడ్ నిర్మాత... బీబీఎం విద్యార్థినిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతటితో సరిపెట్టుకోని ఆ కామాంధుడు... ఆ విద్యార్థిని న్యూడ్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ.. తాను అనుకున్నపుడు లైంగికవాంఛ తీర్చుకోవడమే కాకుండా, తనకు ముంబై మాఫియాతో లింకులు ఉన్నాయని బెదిరిస్తూ వచ్చాడు. అయితే, ఈ విద్యార్థిని ధైర్యం చేసి పోలీసులకు వివరించడంతో ఆ బాలీవుడ్ నిర్మాతపై నిర్భయ కేసును నమోదు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పేరు కరీం మొరానీ. బాలీవుడ్ నిర్మాత. బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్‌తో దిల్‌వాలే, చెన్నై ఎక్స్‌ప్రెస్, రావణ్ వంటి చిత్రాలు నిర్మించారు. రెండేళ్ల కిందట మూవీలో ఛాన్స్ ఇస్తానని చెప్పి బీబీఎం విద్యార్థినిని ఆయన ట్రాప్ చేశాడు. దిల్‌వాలే చిత్రీకరణ సమయంలో హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ సమీపంలో ప్రొడ్యూసర్ పలుమార్లు తనపై అత్యాచారం జరిపాడు. ఆ సమయంలోనే న్యూడ్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆరు నెలలపాటు ముంబై, హైదరాబాద్‌ల్లో వేధింపులకు పాల్పడ్డాడు. అప్పటికీ సినీమాల్లో అవకాశం ఇప్పించక పోవడంతో ఆ యువతి హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన గోడును వెళ్లబోసుకుంది. 
 
ఈనెల 10వ తేదీన హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో నిర్మాత కరీంపై ఫిర్యాదు చేసింది. తనకు మాఫియాతో సంబంధాలున్నాయని, ఈ విషయం బయటికి వెల్లడిస్తే చంపేస్తానని కరీం బెదిరించేవాడని, చివరికి వేధింపులు తట్టుకోలేని ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. అన్ని అంశాలను పరిశీలించిన పోలీసులు నిర్మాతపై నిర్భయ చట్టం, మరో మూడు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

దూరదృష్టి కలిగిన 'నా(యుడు)యకుడు' దొరకడం తెలుగు ప్రజల అదృష్టం... ప్రముఖుల విషెస్

మీ పెద్దమ్మాయి వద్దు.. చిన్నామ్మాయి కావాలి.. వరుడు కండిషన్!!

రైలు బోగీలపై నడిచిన యువకుడు - హైటెన్షన్ విద్యుత్ వైరు తగ్గి... (Video)

తండ్రి మృతదేహం వద్దే ప్రియురాలి మెడలో తాళికట్టిన యువకుడు (Video)

వధువు స్థానంలో తల్లి.. బిత్తరపోయిన వరుడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం