Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు, మహేష్, ప్రభాస్‌‌లను జగన్ జూనియర్ ఆర్టిస్టులను చేశారు.. ఆర్జీవీ

Webdunia
శనివారం, 12 ఫిబ్రవరి 2022 (15:01 IST)
సినిమా సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్‌తో పాటు పలువురు దర్శకులు వెళ్లి సీఎం జగన్‌తో చర్చించిన సంగతి తెలిసిందే. ఇలా స్టార్స్ సీఎం దగ్గరకు వెళ్లడంపై ట్విట్టర్‌లో ట్వీట్ ద్వారా స్పందించిన వర్మ స్టార్ హీరోలను తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
 
సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్ వల్ల ఈ మీటింగ్ జరిగినప్పటికీ, ఒమేగా స్టార్‌ని వైఎస్ జగన్ ఆశీర్వదించినందుకు తాను సంతోషిస్తున్నానని తెలిపాడు. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్‌ని తాను అభినందిస్తున్నానంటూ శుక్రవారం ట్వీట్ చేశాడు వర్మ.
 
అంతకు ముందు "ఓ మెగా అభిమానిగా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా హర్ట్ అయ్యా" అంటూ ట్వీట్ చేసి కాసేపటికే డిలీట్ చేశారు. ఇక ఆ తర్వాత శుక్రవారం అర్థరాత్రి వర్మ జగన్ మెగా సూపర్ డూపర్ ఓమెగా స్టార్ అంటూ ట్వీట్లతో రెచ్చిపోయారు.
 
చిరంజీవి, మహేష్ , ప్రభాస్‌లను ఓమెగా స్టార్ జగన్ జూనియర్ ఆర్టిస్టులను చేశారంటూ ట్వీట్ చేసిన వర్మ.. మెగా, సూపర్ బాహుబలి కంటే జగన్, పేర్ని నానిలే పెద్ద స్టార్స్ అని.. బెగ్గింగ్ రీల్ స్టార్స్, ఆరాధాన పూర్వక ట్వీట్స్ వేస్తే.. రియల్ స్టార్స్ కనీసం రిప్లై ట్వీట్ కూడా వేయటం లేదని ఆర్జీవీ సంచలన ట్వీట్స్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

iPhone: హుండీలో పడిపోయిన ఐఫోన్... తిరిగివ్వబోమన్న అధికారులు.. ఎక్కడ?

15 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments