సైరాపై రామ్ గోపాల్ వ‌ర్మ షాకింగ్ కామెంట్స్..!

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (12:40 IST)
మెగాస్టార్ చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి ఫ‌స్ట్ ట్రైల‌ర్ ఇటీవ‌ల రిలీజ్ చేసారు. ఈ రోజు సెకండ్ ట్రైల‌ర్ రిలీజ్ చేసారు. అయితే... వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సైరా సెకండ్ ట్రైల‌ర్ పై ట్విట్ట‌ర్ లో స్పందించారు. 
 
ఇంత‌కీ వ‌ర్మ రియాక్ష‌న్ ఏంటంటే..? చిరు స్థాయికి తగ్గ చిత్రం తీసి చిరంజీవికి మరియు తెలుగు ప్రేక్షకులకు గొప్ప బహుమతిని ఇచ్చిన నిర్మాత రామ్ చరణ్ కి ధన్యవాదాలు అంటూ చ‌ర‌ణ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ వ‌ర్మ ట్వీట్ చేసారు. వివాద‌స్ప‌దంగా... స్పందించే వర్మ సైరా ట్రైలర్ పై ఇలా పాజిటివ్‌గా ట్వీట్ చేయడం విశేషం. 
 
కొంత మంది మెగా అభిమానులు అయితే...ఇది నిజ‌మేనా..? వ‌ర్మ ఇంత పాజిటివ్‌గా సైరాపై స్పందించారా అంటూ ఆశ్య‌ర్య‌పోతున్నారు. ఇక ఈ ట్రైల‌ర్‌కు సామాన్యుల నుంచే కాకుండా అసామాన్యులు నుంచి కూడా ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. దీంతో సైరా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.
 
చిరంజీవికి జంటగా నయనతార, తమన్నా నటించ‌గా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు.

గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబ‌ర్ 2న  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని  ప్రపంచ వ్యాప్తంగా భారీ స్ధాయిలో విడుద‌ల‌ చేస్తున్నారు. మ‌రి... వ‌ర్మ ట్వీట్ పై చ‌ర‌ణ్ స్పందిస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

పాఠాశాల ఐదో అంతస్థు నుంచి దూకేసిన పదవ తరగతి బాలిక.. కారణం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments