Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఫస్ట్ లుక్... ఆర్జీవీ సర్‌ప్రైజ్

రియల్‌స్టోరీలను సిల్వర్‌స్రీన్‌పై అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ ఎవరంటే మొదటగా గుర్తొంచ్చే పేరు రాంగోపాల్‌వర్మ. సోషల్‌మీడియాలో ఎప్పటికపుడు తన అభిప్రాయాలను, కొత్త సినిమాల అప్‌డేట్స్ ఆడియెన్స్‌తో షేర్

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (06:56 IST)
రియల్‌స్టోరీలను సిల్వర్‌స్రీన్‌పై అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ ఎవరంటే మొదటగా గుర్తొంచ్చే పేరు రాంగోపాల్‌వర్మ. సోషల్‌మీడియాలో ఎప్పటికపుడు తన అభిప్రాయాలను, కొత్త సినిమాల అప్‌డేట్స్ ఆడియెన్స్‌తో షేర్ చేసుకుంటాడు వర్మ. ఇటీవలే వర్మ దివంగత మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథతో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను తీస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
 
ఆ ప్రకటనను నిజం చేస్తూ రాంగోపాల్ వర్మ అందరికీ తేరుకోలేని షాకిచ్చారు. స్వర్గీయ మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాను తీస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి తనదైన మార్కును చూపించాడు. 
 
ఫస్ట్‌లుక్‌లో ఓ మహిళ గడప దాటి ఇంట్లోకి వెళుతుండగా.. లోపల మరో వ్యక్తి కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఫస్ట్‌లుక్‌ను గమనిస్తే ఇంట్లోకి వెళ్తున్న మహిళ లక్ష్మీపార్వతి పాత్రలో, లోపలున్న వ్యక్తి ఎన్టీఆర్ పాత్రలో కనిపించినట్లు తెలుస్తోంది. 
 
వర్మ ఎవరూ ఊహించని విధంగా ఫస్ట్ లుక్ విడుదల చేసి, సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేస్తున్నారు. అయితే లీడ్ రోల్స్‌లో ఎవరెవరు నటిస్తున్నారనే విషయంపై మాత్రం వర్మ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
 
అలాగే, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు హీరో జేడీ చక్రవర్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం కావని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ బయోపిక్ కోసం పరిశోధన మొత్తం పూర్తయిందని వర్మ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments