చలపతిరావుతో తనకు అంత పరిచయం లేకపోయినా.. ఆయనతో మూడు రోజులు మాత్రమే పనిచేసిన అనుభవం ఉన్నా.. ఆయన వ్యాఖ్యలపై తాను స్పందిస్తానన్నారు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్‌లో చలపతిరావు కామెంట్స్‌ను జ
అమ్మాయిలు హానికరం కాదు.. పక్కలోకి పనికివస్తారు.. అని సీనియర్ నటుడు చలపతిరావు చేసిన కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్‌పై నిరసనలు వెల్లువెత్తాయి. మహిళా సంఘాలు రోడ్డుకెక్కాయి. కేసు నమోదు చేశాయి. ఆపై చలపతిరావు క్షమాపణ చెప్పాక శాంతించాయి. ఈ నేపథ్యంలో చలపతిరావు కామెంట్స్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. ఎప్పుడూ ట్విట్టర్లో వివాదాస్పద ట్వీట్లతో అందరి నోళ్ళలో నానే వర్మ.. చలపతిరావు వ్యాఖ్యలను కూడా లైట్‌గా తీసుకున్నారు.
చలపతిరావుతో తనకు అంత పరిచయం లేకపోయినా.. ఆయనతో మూడు రోజులు మాత్రమే పనిచేసిన అనుభవం ఉన్నా.. ఆయన వ్యాఖ్యలపై తాను స్పందిస్తానన్నారు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్‌లో చలపతిరావు కామెంట్స్‌ను జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసుకోవాలన్నారు. చలపతిరావు అలా అనేసరికి అందరూ నవ్వేశారు. తన ట్వీట్స్ వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. అయినా అవి తన ఉద్దేశం ప్రకారమే వుంటాయి. కానీ ప్రజలు అలా తీసుకోరు. చలపతిరావు అన్న మాటలు ఆయనే కాదు.. చాలామంది అంటారు.
మహిళలపై సినిమా వాళ్లే కాదు.. బయటోళ్లు కూడా ఇలాంటి మాటలంటారు. అయితే పబ్లిక్‌లో అలా అనేయడంతో అదేదో పెద్ద ఇష్యూ చేయడం కాకుండా ఎంటర్‌టైన్‌గా తీసుకోవాలని వర్మ చెప్పారు. చలపతిరావు అలా అన్నమాత్రానా మహిళలకు తమను మగవాళ్లు అలా అనుకుంటారనే ఫీలింగ్ కలుగుతుందా.. అని ప్రశ్నించారు. చలపతిరావు మాటలకు తర్వాతే మహిళలకు ఆ వ్యాఖ్యల అర్థం తెలుస్తుందా? అన్నారు.
అలా చలపతిరావు అనకపోతే.. మహిళలు తమను అనుకోరా? అంటూ ఆర్జీవీ అడిగారు. ఎంటర్‌టైన్‌మెంట్ వరకే తీసుకుంటే చలపతిరావు కామెంట్లకు అనవసరమైన రచ్చ అవసరం లేదన్నారు. కాంటెస్టులో భాగంగానే ఆయన ఆమాటలు అన్నారనే విషయాన్ని వర్మ గుర్తు చేశారు.