Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు ప్రజాసేవ చేసే ఉద్దేశ్యం లేదు : రాంగోపాల్ వర్మ

Webdunia
సోమవారం, 27 మే 2019 (15:20 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". ఈ చిత్రం ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని ఆదివారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 
 
ఆ తర్వాత ఆయన సోమవారం వెస్ట్ గోదావరి జిల్లాకు వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ, తాము వస్తున్న సైకిల్‌ చక్రాలు పంక్చర్ అయ్యాయనీ అందుకే ఇక్కడకు కారులో రావాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 
 
మరోవైపు, "లక్ష్మీస్ ఎన్టీఆర్" చిత్రం ఈ నెల 31వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని లక్ష్మీపార్వతి దృక్కోణం నుంచి తీసినట్టు వెల్లడించారు. ఇందులో కల్పితాలు ఏవీ లేవనీ, అన్నీ నిజాలే ఉంటాయన్నారు. అయితే, ఈ చిత్రం విడుదలైతే నిజాలు బయటపడతాయనే ఉద్దేశ్యంతోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకాకుండా అడ్డుకున్నారనీ చెప్పారు. 
 
పైగా, రైతుల కష్టాలు తనకు తెలియవన్నారు. తాను ఎపుడూ పొలం పనులు చేయలేదన్నారు. రాజకీయాల్లోకి రాను, ప్రజలకు సేవచేసే ఉద్దేశం నాకు లేదని వర్మ తేల్చి చెప్పారు. అదేసమయంలో త్వరలో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా తీయబోతున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments