Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్‌ ముఖ్యంకాదు... సినిమాపై ఉన్న గౌరవంతో వచ్చా.. చెర్రీ

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (09:23 IST)
తనకు వరుణ్ తేజ్ ముఖ్యంకాదనీ, సినిమాపై ఉన్న గౌరవరంతోనే "అంతరిక్షం" ప్రిరిలీజ్ వేడుకకు వచ్చినట్టు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వెల్లడించారు. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజా, లావణ్య త్రిపాఠి, అదితిరావ్ హైదరీల కాంబినేషన్‌లో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో "అంతరిక్షం 9000 కేఎంపీహెచ్" అనే టైటిల్‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
క్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి రాజీవ్ రెడ్డి ఎడుగూరులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుక తాజాగా జరిగింది. ఇందులో మెగా‌పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా చెర్రీ మాట్లాడుతూ, 'ఏడాదికి ఓ సినిమా చేస్తే గొప్ప. రెండు సినిమాలు చేస్తే అదృష్టం. మా అందరికీ రెండు సినిమాలు చేయాలనే ఉంటుంది. ప్రేక్షకుల ముందుకు రావాలనే ఆనందం.. చేసే సినిమా కన్నా ఆనందంగా ఉంటుంది. వరుణ్‌ మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాడు. వరుణ్‌పైన ఉన్న ప్రేమకన్నా.. ట్రైలర్‌ చూసిన తర్వాత సినిమాపై గౌరవంతో ఈ ఫంక్షన్‌కి వచ్చినట్టు చెప్పారు. 
 
పైగా, ఇటీవలి కాలంలో ఇంత మంచి ట్రైలర్‌ను తాను చూడలేని చెప్పారు. మంచి విజనరీతో గ్రేట్‌ టీమ్ ప్యాషనేట్‌గా చేసిన సినిమాగా నాకు అనిపించింది. ఇంత మంచి సినిమాను మాకు ఇస్తున్నందుకు చిత్ర టీమ్‌కు నా ధన్యవాదాలంటూ చెర్రీ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments