Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ భార్య ఎమోషనల్ ట్వీట్... నాతో కలిసి నా బేబీ కూడా అనుభూతిని పొందింది...

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (16:24 IST)
"ఆర్ఆర్ఆర్" చిత్రంలోని 'నాటునాటు' పాటకు ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును ఆ పాట సృష్టికర్త (సంగీత దర్శకుడు) ఎంఎం కీరవాణి అందుకున్నారు. అయితే, ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి కీరవాణి దంపతులు, చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్ - ప్రణతి, రామ్ చరణ్ - ఉపాసన దంపతులు హాజరయ్యారు. 'నాటునాటు' పాటకు అవార్డు దక్కడంతో వారందరి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. దీన్ని పురస్కరించుకుని ఉపాసన ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. 
 
"ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డు లభించండం, ఈ చారిత్రక సందర్భంలో కడుపులో బిడ్డ సహా తాను పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆర్ఆర్ఆర్ కుటుంబంలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది దేశం గర్వించే విజయం. ఈ ప్రయాణంలో నన్ను భాగస్వామిని చేసిన రామ్ చరణ్‌, దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు. నాతో కలిసి నా బేబీ (పుట్టబోయే బిడ్డ) కూడా ఈ అనుభూతిని పొందుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. చాలా ఉద్వేగంగా కూడా ఉంది" అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వారంతా దిగిన గ్రూపు ఫోటోను రాజమౌళి షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments