Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్‌ను విడుదల చేసిన రామ్ చరణ్ ఏమ‌న్నాడు..?

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (21:51 IST)
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ ఆగస్టు 15 న విడుదల అవుతున్న విషయం విదితమే. చిత్ర ప్రచారంలో భాగంగా ‘రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్ విడుదల అయింది.
 
‘రణరంగం’ చిత్రం సౌండ్ కట్ ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు విడుదలచేశారు. రామ్ చరణ్ కు శర్వానంద్ మంచిమిత్రుడు. తన మిత్రుడి చిత్రం సౌండ్ కట్ ట్రైలర్ ను చూసిన అనంతరం రామ్ చరణ్ స్పందిస్తూ…‘సూపర్బ్..సౌండ్ కట్ ట్రైలర్ చాలా కొత్తగావుంది.టెర్రిఫిక్ గా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఇటీవలే విడుదల అయింది. 
 
మళ్ళీ శర్వానంద్ ని మేము ఎలా అయితే చూడాలనుకున్నామో అలావుంది. పర్ఫెక్ట్ గా ఉంది. శర్వాలో ఉన్నది, మాకు నచ్చింది. అతనిలో ఉన్న ఇంటెన్సిటీ. 
 
అతని చిత్రాల్లో కో అంటే కోటి చిత్రం నాకిష్టం. అలాంటి ఇంటెన్సిటీతో ఉన్న చిత్రం శర్వాకు పడితే బాగుంటుంది అనుకునేవాడిని. ఇప్పుడీ రణరంగం సౌండ్ కట్ ట్రైలర్‌ను చూసిన తరువాత అలాంటి చిత్రం అనిపించింది. దర్శకుడు సుధీరవర్మ ఈ చిత్రం తో తన ప్రతిభను మళ్ళీ నిరూపించుకున్నారనిపించింది. 
 
చాలా మంచి ప్లాట్ ఉన్న చిత్రం. సన్నివేశాల తాలూకు కట్స్ చాలా బాగున్నాయి. ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. టెర్రిఫిక్ గా ఉంది. ప్రశాంత్ పిళ్ళై సంగీతం బాగుండటం తో పాటు కొత్తగా ఉంది. డెఫినెట్ గా చిత్రం విజయం సాధించాలని చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు రామ్ చరణ్. ఈకార్యక్రమంలో చిత్ర కథానాయకుడు శర్వానంద్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments