లాస్ ఏంజెల్స్‌లో లూయిస్ విట్ట‌న్ ఎక్స్‌డ‌బ్ల్యూ మ్యాగ‌జైన్ పార్టీలో చెర్రీ

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (10:21 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ ఇప్పుడు విశ్వ‌వేదిక మీద మెరుస్తున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉన్నారు. 2023 గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక కోసం ఆయ‌న లాస్ ఏంజెల్స్‌కి వెళ్లారు. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అద్భుతంగా తెర‌కెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రెండు కేట‌గిరీల్లో నామినేట్ అయింది. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ విభాగంలోనూ, నాటు నాటు పాట బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలోనూ నామినేట్ అయిందీ చిత్రం.
 
జ‌న‌వ‌రి 11న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. అయితే ఆ వేడుక క‌న్నా ముందే మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్ మ‌రో వేడుక‌లో మెరిశారు. క్యాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్‌లో జ‌రిగిన ఓ అంద‌మైన వేడుక‌లో రామ్‌చ‌ర‌ణ్ త‌ళుక్కుమ‌న్నారు. లూయిస్ విట్ట‌న్ ఎక్స్‌డ‌బ్ల్యూ మ్యాగ‌జైన్ సీజ‌న్‌ కిక్ ఆఫ్ పార్టీల్లో హాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో వేదిక పంచుకున్నారు. 
 
మిరిండా కెర్‌, మిశ్చ‌ల్ యోతో పాటు ప‌లువురు హాలీవుడ్ సెల‌బ్రిటీలు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. మ‌న దేశం నుంచి ఈ పార్టీకి హాజ‌రైన ఏకైక న‌టుడు రామ్‌చ‌ర‌ణ్ కావ‌డం తెలుగు వారికి గ‌ర్వ‌కార‌ణం. తెలుగు సినిమాకు అంత‌ర్జాతీయ వేదిక‌ మీద ప్రాతినిథ్యం వ‌హించారు. లూయిస్ విట్ట‌న్ పార్టీలో రామ్‌చ‌ర‌ణ్ ఫ్యాష‌న్ స్టేట్‌మెంట్ ఆక‌ట్టుకుంది. చూడ‌చ‌క్క‌గా ఉన్నార‌నే కితాబులు అందుతున్నాయి. బ్లేజ‌ర్‌, ప్రింట‌డ్ ష‌ర్ట్‌తో హ్యాండ్‌స‌మ్‌గా క‌నిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరూర్‌ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

తుఫాను ప్రారంభమైంది... భూమిని సమీపించే కొద్దీ తీవ్రమవుతుంది.. ఏపీఎస్డీఎంఏ

ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తున్న యువతిని కాటేసిన పాము.. మూడు ముక్కలైనా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments