Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైలాగ్‌ పాతదే అయినా... కథ మీద చరణ్‌ విశ్వాసం... 'ధృవ' కెపాసిటీ ఏంటో?

రామ్‌ చరణ్‌ హీరోగా 'ధృవ' చిత్రం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమా మొదట దసరా సీజన్‌కే విడుదలవుతుందనుకున్నా, ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఆలస్యం అవ్వడంతో డిసెంబర్‌కు వెళ్ళిపోయింది. దీంతో నిరుత్సాహపడ్డ అభిమానుల్లో దసరా పండగ రోజున ఎలాగైనా ఉ

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (17:22 IST)
రామ్‌ చరణ్‌ హీరోగా 'ధృవ' చిత్రం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమా మొదట దసరా సీజన్‌కే విడుదలవుతుందనుకున్నా, ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఆలస్యం అవ్వడంతో డిసెంబర్‌కు వెళ్ళిపోయింది. దీంతో నిరుత్సాహపడ్డ అభిమానుల్లో దసరా పండగ రోజున ఎలాగైనా ఉత్సాహం నింపాలన్న ఆలోచనతో ధృవ టీమ్‌ ఫస్ట్‌ టీజర్‌ను విడుదల చేసింది. 
 
గత మూడు రోజులుగా భారీ ఎత్తున ప్రచారం పొందుతూ ఈ టీజర్‌ విడుదలైంది. రామ్‌ చరణ్‌ పోలీసాఫీసర్‌ లుక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సురేందర్‌ రెడ్డి మార్క్‌ స్టైలిష్‌ షాట్స్‌, ఆ షాట్స్‌ను సరిగ్గా వాడుతూ కట్‌ చేసిన విధానం.. ఇలా టీజర్‌ ఆద్యంతం కట్టిపడేసేలా ఉంది. వీటికి తోడు ''నీ స్నేహితుడెవడో తెలిస్తే, నీ క్యారెక్టర్‌ తెలుస్తుంది. నీ శత్రువెవడో తెలిస్తే, నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్‌ చేసుకున్నాను.'' అంటూ రామ్‌ చరణ్‌ చెప్పిన డైలాగ్‌ ఈ టీజర్‌కే హైలైట్‌గా చెప్పుకోవాలి. 
 
కొసమెరుపేమంటే.. ఇదే డైలాగును ఇంచుమించు.. పలు సినిమాల్లోనూ వచ్చాయి. చిరంజీవి నటించిన ఓ సినిమాలోనూ ఇలాంటి డైలాగే వుంది. మరి పాత డైలాగ్‌లయినా.. తమిళంలో ఘన విజయం సాధించిన 'తని ఒరువన్‌'కి రీమేక్‌ కనుక.. తెలుగులో ఎలా ఆడుతుందో చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments