Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజ, రానా, కాజల్‌ల నేనే రాజు నేనే మంత్రి ప్రారంభం.. ట్విట్టర్లో ఫోటో..

యంగ్ హీరో 'రానా' నేనే రాజు నేనే మంత్రి అంటున్నాడు. భళ్లాల దేవుడిగా వావ్ అనిపించిన ఈ హీరోని దర్శకుడు 'తేజ' రాజు, మంత్రిగా చూపించబోతున్నాడు. 'బాహుబలి' చిత్రంతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న 'రానా' ప్

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (17:19 IST)
యంగ్ హీరో 'రానా' నేనే రాజు నేనే మంత్రి అంటున్నాడు. భళ్లాల దేవుడిగా వావ్ అనిపించిన ఈ హీరోని దర్శకుడు 'తేజ' రాజు, మంత్రిగా చూపించబోతున్నాడు. 'బాహుబలి' చిత్రంతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న 'రానా' ప్రస్తుతం 'బాహుబలి 2' షూటింగ్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో సోలోగా నటిస్తున్న 'ఘాజీ' సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో 'రానా', 'తేజ' దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం 'నేనే రాజు నేనే మంత్రి' అనే టైటిల్‌ను 'తేజ' ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
 
నిజానికి రానా హీరోగా చేసింది చాలా తక్కువ సినిమాలే కాని చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత రానా... డైరెక్టర్ తేజ తీస్తున్న... ''నేనే రాజు నేనే మంత్రి'' సినిమాలో హీరోగా చేస్తున్నాడు. తేజ సినిమాలో ఏదోక ప్రత్యేకత ఉంటుంది. బహుశా ఈ కారణం వల్లే రానా హీరోగా చేయడానికి ఒప్పుకొని ఉండవచ్చని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే...నటుడు రానా దగ్గుబాటి తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక ఫొటోను పోస్ట్‌ చేశారు.
 
అందులో గాజులతో ఉన్న ఒక అమ్మాయి చెయ్యి, బ్రేస్‌లెట్‌ ధరించి ఉన్న అబ్బాయి చెయ్యి కలిసి ఉన్నాయి. మరి వీరిద్దరూ ఎవరో కాదు.. నటుడు రానా దగ్గుబాటి, నాయిక కాజల్‌. వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం షూటింగ్‌ షెడ్యూల్‌ ఇటీవల ప్రారంభమైందని తెలుపుతూ.. రానా, కాజల్‌ తమ ట్విట్టర్‌ ఖాతాల్లో ఒకే ఫొటోను పోస్ట్‌ చేశారు. ''నా సూపర్‌ కో-స్టార్‌ను పరిచయం చేస్తున్నా! కాజల్‌ అగర్వాల్‌, సరి కొత్త ఆరంభం'' అని రానా ట్వీట్‌ చేస్తే ''బుద్ధిబలం, బాహుబలం కలిసి పనిచేయడం సూపర్‌ఫన్‌ కదా..'' అంటూ కాజల్‌ ట్వీట్‌ చేశారు. తేజ తన సొంత నిర్మాణ సంస్థ చిత్రం మూవీస్‌పై తెరకెక్కిస్తున్నఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ అలెర్ట్!!

వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ-వారం పాటు వాయిదా

పౌరసత్వం కేసు : చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు షాక్.. రూ.25 లక్షలు చెల్లింపు

Janavani: జనవాణి కోసం రీ షెడ్యూల్.. వేసవికాలం కావడంతో పనివేళల్లో మార్పులు

భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments