Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌ఆర్‌ఆర్ ప్రెస్ మీట్: నేనే అల్లూరి సీతా రామరాజుని అంటున్న రామ్ చరణ్

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (14:09 IST)
'బాహుబలి' తర్వాత భారీ అంచనాలతో రాజమౌళి రూపొందిస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తుండటం మరో విశేషం. ఆ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్‌లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విశేషాలను చిత్ర యూనిట్ ప్రేక్షకులకు తెలియజేసింది.

ఈ సినిమా కథ, పాత్రలపై ప్రేక్షకులకు ఉన్న ఉత్కంఠతకు తెరతీస్తూ.. కథను ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రల్ని తెలియజేసారు రాజమౌళి. దీనిపై ఆయన మాట్లాడుతూ, ఆర్.ఆర్.ఆర్ మూవీ ఫిక్షనల్ మూవీ అని.. ఇందులో రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రను పోషిస్తూండగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్నారంటూ ఉత్కంఠకు తెరదించారు.
 
ఆ తర్వాత చెర్రీ మాట్లాడుతూ.. ‘నేను ఇంకా రియాలిటీలోనూ ఇది నిజమా కాదా అనే అనిపిస్తుంది. ఎప్పటి నుండో రాజమౌళితో పని చేయాలని ఉంది. అయితే నాకు బాగా నచ్చే వ్యక్తి ఎన్టీఆర్‌తో కలిసి పని చేయడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. రాజమౌళి ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఆయన ఇంటికి వెళ్లాను. వెళ్లగానే జూనియర్ ఎన్టీఆర్ కనిపించారు. అదేంటి ఈయన ఉన్నారు అనుకున్నాను.

ఇద్దరం ఒకరి ముఖం ఒకరం చూసుకున్నాం.. కొంచెంసేపయ్యాక.. మా ఇద్దర్నీ లోపలికి తీసుకువెళ్లి.. ఈ కథను చెప్పారు. ఖచ్చితంగా మీతో సినిమా చేస్తున్నాం అని ఆయనతో చెప్పాం. ఆ ఆనందంలో తీసిన ఫొటోనే అప్పట్లో మీతో షేర్ చేసాము. ఈ ఫిక్షనల్ స్టోరీ.. చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. మా కాంబినేషన్‌లో వచ్చిన పాత చిత్రాలను మించి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’ అని అన్నారు.
 
అంచనాలు బాగానే ఉన్నాయి కానీ... ఇది ఎప్పటికి పూర్తి చేస్తాడో... ఎప్పుడు విడుదల చేస్తాడో మరి... రాజమౌళి గారికే తెలియాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments