Webdunia - Bharat's app for daily news and videos

Install App

చ‌ర‌ణ్ - బోయ‌పాటి మూవీ టైటిల్ ఇదే..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ "రంగ‌స్థ‌లం" సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. రూ.100 కోట్ల షేర్ సాధించిన‌ప్ప‌టికీ ఇంకా హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతుండ‌టం విశేషం.

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (13:15 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ "రంగ‌స్థ‌లం" సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. రూ.100 కోట్ల షేర్ సాధించిన‌ప్ప‌టికీ ఇంకా హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతుండ‌టం విశేషం. ఇక చ‌ర‌ణ్ చేయ‌బోయే త‌దుపరి చిత్రం బోయ‌పాటి శ్రీనుతో అనే విష‌యం తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే, బోయ‌పాటి సినిమా టైటిల్స్ హీరోయిజం ఉట్టిప‌డేలా.. ఎంత మాస్‌గా ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌సం లేదు. ఒక్క "జ‌య జాన‌కి నాయ‌క" చిత్రం ఒక్క‌టే క్లాస్‌గా అనిపిస్తుంది. చ‌ర‌ణ్ మూవీకి "రాజవంశ‌స్థుడు" అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. చ‌ర‌ణ్ టైటిల్ క‌న్ఫ‌ర్మ్ అవ్వాలంటే.. ఒక్క చ‌ర‌ణ్‌కి న‌చ్చితే స‌రిపోదు. మెగాస్టార్ చిరంజీవికి న‌చ్చాలి. అప్పుడే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు లెక్క‌. 

ప్ర‌స్తుతానికి "రాజవంశ‌స్థుడు" టైటిల్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నార‌ట‌. మ‌రి.. చిరు విన్న త‌ర్వాత ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే.. అప్పుడు ఈ టైటిల్నే ఫిక్స్ చేయ‌చ్చు. మ‌రి ఈ టైటిల్‌నే క‌న్‌ఫ‌ర్మ్ చేస్తారా..? లేక వేరే టైటిల్ పెడ‌తారా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments