Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ చిత్రం నుంచి అర్థాంతరంగా తొలగించారు : రకుల్ ప్రీత్ సింగ్

ఠాగూర్
శనివారం, 14 సెప్టెంబరు 2024 (10:36 IST)
తనను ప్రభాస్ చిత్రం నుంచి అర్థాంతరంగా తొలగించారంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆరోపించారు. దక్షిణాదిలో సినీ అవకాశాలు తగ్గిపోవడంతో ఈ భామ ఇపుడు బాలీవుడ్‌కు పరిమితమయ్యారు. అనేక మంది తెలుగు స్టార్ హీరోలతో నటించిన రకుల్.. ఇటీవలికాలంలో ఆమె హవా పూర్తిగా తగ్గిపోయింది. టాలీవుడ్‌లో చివరిగా "కొండపొలం" చిత్రంలో నటించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంతో బిజీగా ఉన్న రకుల్.. తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనను రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా నుండి చెప్పకుండానే తీసేశారని వ్యాఖ్యానించారు. 
 
తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కేరీర్ తొలినాళ్లలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చిందన్నారు. సరైన బ్రేక్ అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రభాస్ సరసన నటించే అవకాశం రావడంతో చాలా సంతోషించానని చెప్పింది. అయితే నాలుగు రోజుల పాటు షూటింగ్ పూర్తి చేసుకుని తాను ఢిల్లీకి వెళ్లగా, ప్రభాస్ సినిమా నుండి తనను తొలగించినట్లు తెలిసిందన్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
మరో తెలుగు సినిమాలోనూ ఇలానే జరిగిందన్నారు. అయితే ఆ సినిమా షూటింగ్ ప్రారంభంకాక ముందే తొలగించారని చెప్పింది. ఆ తర్వాత తనకు ఇండస్ట్రీపై అవగాహన వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవద్దని అనుకున్నానని తెలిపింది. ప్రభాస్ సినిమా నుండి తనను తొలగించారని రకుల్ కామెంట్స్ చేయడంతో ఆ చిత్రం ఏమిటనేది హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆ చిత్రం మరేదో కాదు 'మిస్టర్ ఫర్‌ఫెక్ట్'. ఈ చిత్రంలో ముందుగా ప్రభాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్ అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నారు. 
 
ఈ విషయంపై మిస్టర్ ఫర్‌ఫెక్ట్ నిర్మాత దిల్ రాజు వివరణ కూడా ఇచ్చారు. రకుల్‌తో ఐదు రోజుల పాటు షూటింగ్ కూడా చేశామని, అయితే ఆ రషెష్ సంతృప్తి కల్గించలేదన్నారు. ఎందుకంటే 'మిస్టర్ ఫర్‌ఫెక్ట్' మూవీ అంతా హీరోయిన్ క్యారెక్టర్ బేస్ చేసుకుని ఉంటుందని, రకుల్ చాలా సన్నగా ఉందని చెప్పారు. ఎందుకైనా మంచిదని చెప్పి షూటింగ్ ఆపేశామని, విషయాన్ని ప్రభాస్‌కు కూడా చెప్పి డిస్కస్ చేసిన తర్వాత కాజల్ అగర్వా‌ను రకుల్ ప్లేస్ తీసుకోవడం జరిగిందన్నారు. రకల్‌ను అలా పక్కన పెట్టడం అనేది తమకు చాలా బాధ అనిపించిందని, అయితే తమకు సినిమా కంటే ఏదీ ఎక్కువ కాదన్నారు. ss

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్త్ డే పార్టీకి వెళితే మత్తు ఇచ్చి 7 రోజుల పాటు యువతిపై 23 మంది అత్యాచారం

కిడ్నాప్ కేసు : వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్‌.. ఆర్కే రోజా స్పందన.. ఏంటంటే?

బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments