Webdunia - Bharat's app for daily news and videos

Install App

దమ్ము కొడితే తప్పేంటి? ప్ర‌శ్నిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (22:04 IST)
కింగ్ నాగార్జున తాజా చిత్రం మ‌న్మ‌థుడు 2. ఈ చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న రకుల్ ప్రీత్ సింగ్ న‌టించింది. ఈ చిత్రంలో ఈమె అవంతిక అనే పోర్చుగల్ అమ్మాయిగా నటించింది. అవంతిక టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజ‌ర్లో ర‌కుల్ ప్రీత్ సింగ్ పొగ తాగిన‌ట్టు చూపించ‌డంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. 
 
ఇదే విషయంపై పాత్రికేయులు ఆమెను ప్రశ్నిస్తే.. `మన్మథుడు 2`లో నేను సిగరెట్ తాగలేదు. అవంతిక పాత్ర మాత్రమే సిగరెట్ తాగుతుంది. అవంతిక పాత్రలో చాలా ఎనర్జీ ఉంటుంది. నాటీ పాత్ర. పాత్రను డైరెక్టర్ రాహుల్ చక్కగా డిజైన్ చేశారు.
 
ఆ పాత్ర డిజైన్ చేసిన తీరుగానే నేను పొగతాగినట్లు నటించాను. అయినా హీరో పొగ తాగితే తప్పులేదు కానీ.. హీరోయిన్స్ పొగ తాగితే తప్పా?.
 
నేను నిజ జీవితంలో పొగతాగను. మన సోసైటీలో చాలా జరుగుతున్నాయి. కానీ బయట చెప్పాలనుకున్నప్పుడు సమాజం ఏమనుకుంటుందోనని ఆలోచిస్తుంటాం. అవంతిక పాత్ర సిగరెట్ తాగడం గురించి కాదు కదా.. ఓ స్ట్రాంగ్ ఎమోషన్ గురించి చెప్పడానికి చేసిన సినిమా ఇది`` అంటూ ద‌ర్శ‌కుడు రాహుల్‌ని వెన‌కేసుకొస్తూ... అలా చేస్తే త‌ప్పేంటి అంటూ మీడియానే ప్ర‌శ్నిస్తుంది ఈ అమ్మ‌డు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

బెడ్రూంలో నాతో కలిసి నా భర్త ఏకాంత వీడియోలు, అరెస్ట్ చేయండి అంటూ భార్య ఫిర్యాదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments