సాహో విడుదలకు రెడీ అయ్యేందుకు సిద్ధమౌతోన్న సందర్భంలో.... సినిమాలో నటించిన ఒక్కో పాత్రను పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, శ్రద్ధా కపూర్ లుక్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నటుడు అరుణ్ విజయ్ లుక్‌ని విడుదల చేశారు. తమిళంలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో... విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ.. మంచి పేరు తెచ్చుకున్న అరుణ్ విజయ్ సాహోలో అద్భుతమైన పాత్రతో మెప్పించబోతున్నాడు.
భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమాలోని ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. అలాగే అరుణ్ విజయ్ పాత్ర సినిమాలో చాలా కీలకం. ఈ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
"Blood doesn't need bloody invitation" అనే క్యాప్షన్‌ని బట్టే ఈ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా వుండనుందో అర్థం చేసుకోవచ్చు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా యు.వీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం సాహో. యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కుతుంది. ఈ చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
బాహుబలి లాంటి చిత్రం తరువాత వస్తున్న చిత్రం కావటంతో రెబల్‌స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ఇండియన్ సినిమా లవర్స్ అందరూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో మేకర్స్ ఎక్కడా చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఆడియన్స్‌కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటితో అందించాలని నిర్ణయించుకున్నారు.