Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్టీ స్టారర్ ట్రెండ్ ... చైతూ - వెంకీ ప్రాజెక్టుపై భారీ అంచనాలు...

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్ సాగుతోంది. రానున్న రోజులలో ప‌లు మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్స్ ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఇందులో నాగ చైతన్య, వెంకటేష్ ప్రాజెక్టుపై అభిమానుల‌లో భారీ అంచ

Webdunia
ఆదివారం, 27 మే 2018 (11:50 IST)
టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్ సాగుతోంది. రానున్న రోజులలో ప‌లు మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్స్ ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఇందులో నాగ చైతన్య, వెంకటేష్ ప్రాజెక్టుపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. మామ అల్లుళ్ళ కాంబినేషన్‌లో రానున్న‌ మల్టీ స్టారర్ చిత్రం పల్లెటూరు నేపథ్యంలో సాగేలా ఉంటుంద‌ని అంటున్నారు.
 
కె.ఎస్.ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న న‌య‌న‌తార‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసారని, చైతూ స‌ర‌స‌న స‌మంత న‌టిస్తుంద‌ని అన్నారు. 
 
తాజా స‌మాచారం ప్ర‌కారం చైతూ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు టాక్. ఇదే క‌నుక నిజ‌మైతే వీరిద్ద‌రు క‌లిసి న‌టించడం రెండోసారి అవుతుంది. 2017లో వ‌చ్చిన 'రారండోయ్ వేడుక చూద్ధాం' చిత్రంలో చైతూ, ర‌కుల్ జంట‌గా న‌టించారు. గతంలో వెంకటేశ్ జోడీగా నయనతార నటించింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన "లక్ష్మి", "తులసి", "బాబు బంగారం" సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. 
 
ఈ ప్రాజెక్టుని మూడు ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లు నిర్మించ‌నున్న‌ట్టు టాక్‌. వెంకీ హోమ్ బ్యాన‌ర్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు పాపుల‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ సంస్థ అయిన కోన ఫిలిం కార్పొరేష‌న్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని రూపొందించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఈ వివ‌రాల‌పై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments