Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మీ రంగ‌మ్మ‌.. మంగ‌మ్మ'... అదిరిపోయిందంటున్న....

రామ్ చ‌ర‌ణ్, స‌మంత‌ ప్ర‌ధాన పాత్ర‌లో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం 'రంగ‌స్థ‌లం'. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ హిట్ కొట్టి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ.200 కోట్ల వ‌సూళ్ళు సాధించింది. దేవి

Webdunia
ఆదివారం, 27 మే 2018 (11:26 IST)
రామ్ చ‌ర‌ణ్, స‌మంత‌ ప్ర‌ధాన పాత్ర‌లో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం 'రంగ‌స్థ‌లం'. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ హిట్ కొట్టి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ.200 కోట్ల వ‌సూళ్ళు సాధించింది. దేవిశ్రీ అందించిన సంగీతం, చంద్ర‌బోస్ లిరిక్స్‌తో పాటు ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాశ్ రాజ్, అన‌సూయ‌ల ప‌ర్‌ఫార్మెన్స్ సినిమా స‌క్సెస్‌లో స‌గ‌భాగం అయ్యాయి.
 
ఈ చిత్రంలో 'రంగ‌మ్మ‌.. మంగ‌మ్మ' అనే పాట ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మాన‌సి పాడిన ఈ పాట‌ని చిన్న పిల్ల‌ల నుండి పెద్దోళ్ల వ‌ర‌కు తెగ పాడేసుకుంటున్నారు. కొంద‌రు స‌మంత మాదిరి స్టెప్పులు కూడా వేస్తున్నారు. ఇటీవ‌ల ఉత్తేజ్ కూతురు పాట ఓర‌య్యో ఓల‌మ్మో అంటూ పేర‌డి కూడా చేసింది. 
 
ఇది ప్రేక్ష‌కుల‌కి బాగా న‌చ్చింది. అయితే ఓ తాత‌య్య రంగ‌మ్మ మంగ‌మ్మ సాంగ్‌ని త‌న‌కి న‌చ్చిన స్టైల్‌లో పాడి స‌మంత‌ని ఇంప్రెస్ చేశాడు. ఓ నెటిజ‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో స‌మంత‌.. 'మీ రంగ‌మ్మ‌.. మంగ‌మ్మ' సాంగ్ చాలా పాపుల‌ర్ అయింది. వ‌య‌సుతో నిమిత్తం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ఈ పాట పాడుకుంటున్నార‌ని చెబుతూ తాత పాడిన పాట వీడియోని షేర్ చేశాడు. ఇది స‌మంత‌కి కూడా న‌చ్చ‌డంతో రీట్వీట్ చేసి మేడ్‌ మైడే అని కామెంట్ పెట్టింది.
 

సంబంధిత వార్తలు

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments