Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాక్షసి'గా చిత్రంలో రాక్షసిగా కాదు.. తల్లిగా కన్పిస్తా: నటి పూర్ణ

పూర్ణ, అభినవ్‌ సర్ధార్‌, అభిమన్యుసింగ్‌, గీతాంజలి ప్రధాన తారాగణంగా డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై పన్నా రాయల్‌ దర్శకత్వంలో అశోక్‌ మందా, రాజ్‌ దళవాయ్‌, టోనీ నిర్మిస్తున్న ఈ చిత్రం 'రాక్

Webdunia
ఆదివారం, 8 జనవరి 2017 (11:12 IST)
పూర్ణ, అభినవ్‌ సర్ధార్‌, అభిమన్యుసింగ్‌, గీతాంజలి ప్రధాన తారాగణంగా డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై పన్నా రాయల్‌ దర్శకత్వంలో అశోక్‌ మందా, రాజ్‌ దళవాయ్‌, టోనీ నిర్మిస్తున్న ఈ చిత్రం 'రాక్షసి'. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను లగడపాటి శ్రీధర్‌, టైటిల్‌ లోగోను రాజ్‌ కందుకూరి, పోస్టర్‌ను కె.సురేష్‌బాబు విడుదల చేశారు.
 
అనంతరం పూర్ణ మాట్లాడుతూ... ఈ సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించాలని దర్శకుడు పన్నా రాయల్‌ చెప్పగానే ముందుగా ఆలోచించాను. అయితే స్క్రిప్ట్‌ వినగానే సినిమా చేయడానికి అంగీకరించా. రాక్షసి సినిమాలో నేను రాక్షసి పాత్రలో కనపడను. తల్లి పాత్రలో చేయడం గొప్ప అనుభూతినిచ్చింది. ఖచ్చితంగా నా కెరీర్‌లో ఈ సినిమా మరో హిట్‌ మూవీ అవుతుంది. వినోద్‌ యాజమాన్య సంగీతం, కర్ణ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద హైలెట్‌ అంశాలుగా నిలుస్తాయని అన్నారు.
 
దర్శకుడు పన్నా రాయల్‌ మాట్లాడుతూ.. 'కాలింగ్‌ బెల్‌' సినిమా సమయంలోనే రెండోది చేయాలనుకున్నాను. అయితే సీక్వెల్‌ చేసే సమయంలో టైటిల్‌ను 'రాక్షసి' అని నిర్ణయించాం. నిర్మాతల సహకారంతోనే సినిమాను మంచి విలువలతో చేయగలిగాను. సినిమా మంచి టెక్నికల్‌ ఎలిమెంట్స్‌తో అందరికీ నచ్చేలా ఉంటుదని అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments