Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ 'కబాలి'కి తప్పని పైరసీ గండం... 180 పైరసీ లింకుల్లో లీక్...

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం కబాలికి పైరసీ గండం తప్పలేదు. ఇప్పటికే అనేక గండాలు తప్పించుకుని ఈనెల 22వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి పైరసీభూతం పట్టినట్టు ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను వెల్లడించారు.

Webdunia
గురువారం, 14 జులై 2016 (11:54 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం కబాలికి పైరసీ గండం తప్పలేదు. ఇప్పటికే అనేక గండాలు తప్పించుకుని ఈనెల 22వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి పైరసీభూతం పట్టినట్టు ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు 180కి పైగా పైరసీ లింకులను గుర్తించామని, వీటి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉన్నందున వెంటనే ఆయా సైట్లలోంచి తమ సినిమా లింకులను తొలగించాల్సిందిగా కోరారు. 
 
మొబైల్ డౌన్‌లోడ్స్ జోరందుకోక ముందే తమని ఈ గండం నుండి గట్టెంక్కించాల్సిందిగా ఆయన కోర్టుని వేడుకున్నారు. దాదాపు 110 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమా రూపొందించామని, ఆ నిధులు రాబట్టుకోవాలంటే పైరసీని అరికట్టాలని ఆయన కోరారు 
 
కాగా, ఇటీవల పైరసీ బారిన పడ్డ ‘ఉడ్తా పంజాబ్’, ‘సుల్తాన్’ వంటి సినిమాలు పడిన విషయం తెల్సిందే. దీంతో సినిమా పరిశ్రమకి పైరసీ సమస్య నిత్య గ్రహణంలా మారిందని చిత్ర ప్రముఖులు వాపోతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలులో దారుణం.. కాలు నరికి అందరికీ చూపించాడు...

15 రోజుల పసికందును లోకల్ రైలులో వదిలి పారిపోయిన మహిళ.. తర్వాత ఏం జరిగింది?

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. నిందితుల్లో డీన్స్ కుమారుడు? 25 మందిపై సస్పెన్షన్!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులా? ఇద్దరి అరెస్టు కూడా...

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. అంత నేరం ఏం చేశారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments