Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి పోటీలో ఉత్కంఠ పెంచేసిన ర‌జ‌నీకాంత్, F2, VVRలకి గట్టి పోటీ తప్పదా?

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (21:09 IST)
సూప‌ర్ స్టార్ రజనీకాంత్ న‌టిస్తోన్న తాజా చిత్రం పేట‌. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న సిమ్రాన్-త్రిష న‌టిస్తున్నారు. ఇక హీరోగా వరుస విజయాలు అందుకుంటున్న విజయ్ సేతుపతి ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తుండ‌డంతో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. దీనికి తోడు ఈమ‌ధ్య కాలంలో వ‌చ్చిన ర‌జ‌నీ చిత్రాలు ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో అభిమానులు ఈ సినిమా పై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు.
 
తమిళంలో ఈ సినిమాను జనవరి 11వ తేదీన అత్యధిక థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. అయితే… తెలుగులో సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే.. అంటే జనవరి 10వ తేదీనే ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా తాజాగా ప్రకటించారు.
 
జ‌న‌వ‌రి 9న‌ ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ కానుంది. 10న ర‌జ‌నీకాంత్ పేట‌, 11న రామ్ చ‌ర‌ణ్ వినయ విధేయక రామ, 12న వెంకీ – వ‌రుణ్‌ల‌ ఎఫ్ 2.. ఇలా వ‌రుస‌గా క్రేజీ మూవీస్ థియేటర్లకు రానున్నాయి. దీంతో ఈ సంక్రాంతికి పోటీ మ‌రింత రసవత్తరంగా మారింది. మ‌రి… ఈ  సంక్రాంతి పోటీలో విజేత‌గా ఎవ‌రు నిలుస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదు.. అందుకే ఇంటర్‌తో ఆపేశా : పవన్ కళ్యాణ్

15 అడుగుల స్టేజీపై నుంచి కిందపడిన కేరళ ఎమ్మెల్యే ఉమా థామస్ (వీడియో)

Liquor Sales: కొత్త సంవత్సరం.. రెండు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు రూ.684కోట్ల ఆదాయం

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

తెలుపు కాదు.. నలుపు కాదు.. బ్రౌన్ షర్టులో నారా లోకేష్.. పవన్‌ను అలా కలిశారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments