Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవన్నీ గాలి వార్తలే... రజినీకాంత్ 'పేట్ట'తో నాకు సంబంధం లేదు... కళ్యాణ్

Advertiesment
అవన్నీ గాలి వార్తలే... రజినీకాంత్ 'పేట్ట'తో నాకు సంబంధం లేదు... కళ్యాణ్
, గురువారం, 20 డిశెంబరు 2018 (17:42 IST)
'పేట్ట' చిత్రం రైట్స్ పైన వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు అని నిర్మాత సి.కళ్యాణ్ వెల్లడించారు. 
 
"సూపర్ స్టార్ రజినీకాంత్ గారి 'పేట్ట' చిత్రం తెలుగు హక్కులు నేను తీసుకున్నట్టు, రిలీజ్ డేట్ మార్చమని అడిగినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ చిత్రం రైట్స్‌కి నాకు ఎంతమాత్రం సంబంధం లేదనే విషయాన్ని క్లారిఫై చేస్తున్నాను. 
 
ఈ వార్తల్లో నిజం లేదనే విషయాన్ని సన్ పిక్చర్స్ వారికి కూడా తెలియచేశాను. సూపర్‌స్టార్ రజినీకాంత్ గారంటే నాకెంతో గౌరవం. ఆయనతో చిత్రాలు చేయాలని అందరికీ ఉంటుంది. అయితే ఈ చిత్రం రైట్స్ గురించి నేను ఎలాంటి చర్చలూ జరపలేదు." అని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ స్పష్టం చేస్తూ 'పేట్ట' చిత్రం రైట్స్ విషయంలో వస్తున్న వార్తల్ని ఖండించారు.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బసవతారకం హార్మోనియం వాయిస్తుంటే.. ఎన్టీఆర్ అలా చూస్తూ.. (ఫోటో)