Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేట్టాలో త్రిష, రజనీకాంత్ లుక్ భలేగుంది..

Advertiesment
పేట్టాలో త్రిష, రజనీకాంత్ లుక్ భలేగుంది..
, సోమవారం, 10 డిశెంబరు 2018 (14:22 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా పేట్టాలో తలైవా సరసన సిమ్రాన్, త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిమ్రాన్, రజనీ లుక్ విడుదలైంది. తాజాగా త్రిష, తలైవా లుక్ వచ్చేసింది. ఈ లుక్‌లో రజనీకాంత్ స్టైల్ లుక్, త్రిష చీరకట్టు బాగుంది. 
 
ఆల్రెడీ చేతిలో పూల కుండితో సిమ్రాన్‌తో ఉన్న రజినీకాంత్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తాజాగా ఈ మూవీలో రజినీకాంత్, త్రిషకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్‌ చూస్తుంటే. త్రిష పాత్ర ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు సంబంధించినట్టు కనబడుతుంది. విలేజ్ అమ్మాయిగా త్రిష లుక్ బాగుంది. 
 
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన లుక్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో చాలా యంగ్‌గా కనిపించే లుక్ విభిన్నంగా.. ఆకట్టుకునే విధంగా వుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నవాజుద్ధీన్ సిద్ధికీలు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"వీవీఆర్‌"లో చెర్రీతో కలిసి మెగాస్టార్ డాన్స్