Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.2కే మొబైల్ డేటా.. సీడాట్ బంపర్ ఆఫర్

రూ.2కే మొబైల్ డేటా.. సీడాట్ బంపర్ ఆఫర్
, శుక్రవారం, 30 నవంబరు 2018 (09:00 IST)
దేశంలో ఉన్న టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రతరమైంది. ముఖ్యంగా, రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మొబైల్ డేటా చార్జీలు గణనీయంగా తగ్గిపోవడమేకాకుండా, అన్ని టెలికాం కంపెనీలు పోటీపడి మొబైల్ డేటాను తక్కువ ధరలకే అందుజేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ టెలిమ్యాటిక్స్ సంస్థ (సీడాట్) బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెల్‌ ఫోన్లలో అత్యవసరంగా మొబైల్ డేటా అవసరమైన పక్షంలో తక్షణం రూ.2కే మొబైల్ డేటా పొందే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. 
 
ఇందుకోసం ఈ సంస్థ పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ) వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ ద్వారా రూ.2 నుంచి రూ.20 వరకు డేటా అవసరమనుకున్న వారికి క్షణాల్లో అందుతుంది. ఈ సేవలను గురువారం దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో ప్రారంభించారు. ఈ మొబైల్ డేటా పొందేందుకు పబ్లిక్ ఎలక్ట్రానిక్ ఆఫీస్ (పీఈఓ)లను ఏర్పాటు చేయనుంది. వీటిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తారు.
 
ఈ పీఈఓలలో రూ.2 నాణెం వేయదగినట్టుగా కాయిన్ బూత్ వంటి పరికరం ఉంటుంది. ఇందులో రూ.2 నాణెం వేసి మొబైల్ నంబరును ఎంటర్ చేసినట్టయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అందులో ఎటర్ చేస్తే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలతో పాటు తక్కువ ధరలకే డేటాను అందివ్వనున్నట్టు సీడాట్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుకు 'దేశం' ఎమ్మెల్యే షాక్.. పవన్ చెంతకు రావెల కిషోర్ బాబు