Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌జ‌నీకాంత్ - పెద్దన్న విడుద‌లకు ముగ్గురు పెద్ద‌న్న‌లు కార‌ణం ఏం చెప్పారో తెలుసా!

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (18:50 IST)
Suresh babu- Narang
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన పెద్దన్న సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతోంది. టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ, సురేష్ బాబు, దిల్ రాజు కలిసి ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ.. ‘మా మీద నమ్మకం ఉంచి పెద్దన్న చిత్రాన్ని విడుదల చేసేందుకు మాకు అవకాశం ఇచ్చిన సన్ టీవీ వారికి, రజినీకాంత్‌కు ధన్యవాదాలు. సినిమా సూపర్ హిట్ అవుతుంది. రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
సురేష్ బాబు మాట్లాడుతూ ‘పెద్దన్న సినిమా అన్నాత్తెకు డబ్బింగ్‌గా రాబోతోంది. మేం ఈ సినిమాను ఎందుకు తీసుకున్నామా? అని అందరికీ అనుమానం రావొచ్చు. కరోనా తరువాత ఇప్పుడు  ప్రేక్షకులు థియేటర్లోకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ పెద్ద సినిమాను తీసుకొస్తే ఇంకా బాగుంటుందని అనుకున్నాం. ఈ చిత్రంలో మనకు వింటేజ్ రజినీకాంత్ గారు కనిపిస్తున్నారు. మనం ఎలా అయితే రజినీకాంత్‌ను చూడాలని అనుంటామో అలానే దర్శకుడు శివ చూపించారు. ఇందులో  ఎమోషన్ కూడా ఉంది. అన్నాచెల్లెళ్ల బంధం అద్భుతంగా ఉంది. 
 
జగపతి బాబు, కుష్బూ, మీనా, నయనతార ఇలా అందరూ చక్కగా నటించారు. ఫుల్ మీల్స్ లాంటి సినిమా. క్లాస్ మాస్ ఫ్యామిలీ అందరూ చూడగలిగే సినిమా. అందరూ థియేటర్‌కు వచ్చి చూసే సినిమా. ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని, చేయాలని కోరుకుంటున్నాను. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. ఇకపై కూడా మేం కలిసే సినిమాలు చేస్తాం. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా మాకు నచ్చిన చిత్రాలను కలిసే విడుదల చేస్తాం. ఈ సినిమా కథను శివ నాకు చెప్పాడు. ఇలాంటి సమయంలో కమర్షియల్ చిత్రమైతే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం సులభం అవుతుంది. కరోనా పట్ల ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. కానీ మన డైలీ రొటీన్ జీవితాన్ని మాత్రం ఆపకూడదు. దీపావళికి పెద్దన్న సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నామ’అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments