Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలైలో రజనీకాంత్ రాజకీయ పార్టీపై ప్రకటన.. సూపర్ స్టార్ సోదరుడు సత్యనారాయణ

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ఖరారైపోయింది. సినీ స్టార్లు రాజకీయ నేతలుగా అవతరించిన తమిళనాడులో మరో సినీతార రాజకీయ నాయకుడిగా మారనున్నారు. ఆయన ఎవరో కాదు.. రజనీకాంత్. కోడంబాక్కం రాఘవేంద్ర కళ్

Webdunia
శనివారం, 27 మే 2017 (14:47 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ఖరారైపోయింది. సినీ స్టార్లు రాజకీయ నేతలుగా అవతరించిన తమిళనాడులో మరో సినీతార రాజకీయ నాయకుడిగా మారనున్నారు. ఆయన ఎవరో కాదు.. రజనీకాంత్. కోడంబాక్కం రాఘవేంద్ర కళ్యాణ మండపంలో అభిమానులతో ఫోటో షూట్ చేసిన రజనీకాంత్.. మరో ఫోటో షూట్ కార్యక్రమాన్ని జూలైలో ప్లాన్ చేశారట. 
 
ఈ విషయాన్ని రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ బెంగళూరులో చెప్పారు. జూలై తొలి లేదా రెండో వారంలో రజనీకాంత్ పార్టీ గురించి ప్రకటన వుండవచ్చునన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ''కాలా'' సినిమా షూటింగ్ మే 29 వరకు ముంబైలో జరుగనుంది. ఈ షూటింగ్ పూర్తయ్యాక జూలై తొలివారంలో మళ్లీ రజనీకాంత్ ఫ్యాన్స్‌తో భేటీ అవుతారని.. ఈ సందర్భంగా రాజకీయ పార్టీపై ప్రకటన వుండవచ్చునని సత్యనారాయణ వెల్లడించారు. 
 
మే 15 నుంచి 19 వరకు దాదాపు ఐదురోజులపాటు ఇప్పటికే చెన్నైలో అభిమానులతో భేటీ అయిన సందర్భంగా రాజకీయాలపై రజనీకాంత్ వ్యాఖ్యలు చేశారు. ఇంకా తాను రాజకీయాల్లోకి రానున్నానని పరోక్షంగా చెప్పేశారు. ఇక పార్టీపై ప్రకటనే తరువాయి. అలా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే.. తమిళ రాష్ట్రంలోని అనిశ్చితికి తెరపడే అవకాశం ఉందని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చీరల వ్యాపారికి పడకసుఖం ఇస్తూ ఊపిరాడకుండా చేసి చంపేసిన మహిళ... ఎలా?

హస్తిన అసెంబ్లీ పోరుకు ముగిసిన ప్రచారం.. 5న పోలింగ్!!

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. మెల్లగా జారుకున్న పవన్ కల్యాణ్

సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్‌ల విరాళం

ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్‌ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

తర్వాతి కథనం
Show comments