Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ నా తండ్రి : అమీజాక్సన్, 2.O రూ. 500 కోట్లు, బాహుబలిని దాటుతుందా?

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (16:24 IST)
సంచలన దర్శకుడు శంకర్ చిత్రీకరించిన 2.O సినిమా భారీ విజయంవైపు దూసుకువెళుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బాహుబలి రికార్డును అధిగమించి భారీ విజయం వైపు దూసుకువెళుతోంది. సినిమాలో నటించిన రజినీకాంత్‌కు ఎంత పేరు వచ్చిందో హీరోయిన్ అమీ జాక్సన్‌కు అంతే పేరు వచ్చింది. అమీ జాక్సన్ కోసం సినిమాకు వచ్చిన అభిమానులు ఎంతోమంది ఉన్నారంటూ స్వయంగా దర్శకుడు శంకర్ మీడియాకు తెలిపారు.
 
అయితే సినిమా విజయానికి సంబంధించిన తన స్నేహితులతో అమీ జాక్సన్ మాట్లాడారట. సినిమాలో రజినీకాంత్ నన్ను కూతురుగానే చూశారు. ఆయన నటన అద్భుతం. ఆయనతో కలిసి నటించడం ఎంతో సంతోషంగా ఉంది. నన్ను ఆయన ఎంతో అభిమానంగా అమీ అని పిలిచేవారు. నేను సర్ అని సంబోధించేదాన్ని. సినిమా షూటింగ్ సమయానికి రావడం, లైట్‌మెన్ నుంచి కెమెరామెన్ వరకు అందరికీ గౌరవమివ్వడం రజినీకి ఉన్న గొప్ప మనస్సు. నేను ఆయన్ను దగ్గరగా చూశాను కాబట్టి చెబుతున్నానని స్నేహితులకు చెప్పిందట అమీ జాక్సన్.
 
ఇకపోతే 2.O చిత్రం కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 7 రోజుల్లో రూ. 500 కోట్లు దాటేసింది. బాహుబలి రికార్డును అధిగమించే దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం మూడవ స్థానంలో వుంది. మరి ఇదే ఊపు మరో వారం రోజులు సాగితే అనుకున్నట్లే రికార్డు సృష్టించడం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments