Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామోజీరావు ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ బాధపడ్డాడు

డీవీ
బుధవారం, 8 జనవరి 2025 (16:11 IST)
Ramoji, Rajedra
నటకిరీటీ రాజేంద్రప్రసాద్ గురించి ఆయన నటన గురించి తెలియంది కాదు. అలాంటి నటుడు తోటి నటుడు చిరంజీవి, బాలక్రిష్ణ వంటివారు ఇంకా హీరోలుగా నటిస్తూంటే తను మాత్రమే ఎందుకు కథానాయకుడిగా చేయలేకపోతున్నాడు. ఇదే ప్రశ్న ఆయన ముందుకు వస్తే, అందరూ హీరోలయితే నాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు చేస్తారు? అంటూ నాకు నేను సర్దుకుచెప్పుకో వటమనండి, నా లాగా ఎవరూ చేయలేరు అంటూ కాస్త గర్వంగా వుందని చెప్పారు.
 
కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా రాజేంద్రప్రసాద్ నిలుస్తాడు. అలాంటి నటుడు సినిమా నేను ఎక్కువగా చూస్తుంటాననీ, రాజకీయాల్లో కాస్త రిలాక్స్ ఆయన సినిమాలేనని స్వర్గీయ పి.వి.నరసింహారావు చెప్పారు కూడా. అలాగే దివంగత రామోజీరావు కూడా ఓ  సందర్భంలో రాజేంద్రప్రసాద్ ను కలిసి, చూడు రాజేంద్ర.. నీకు పద్మ అవార్డు వచ్చిందా? అంటూ అడిగాడు. నేను తలవంచుకుని లేదండి అని చెప్పారు..సరే.. అంతకంటే పెద్ద అవార్డు ప్రజలిచ్చారు అదిచాలు నీకు అంటూ భుజం తట్టారు అంటూ ఆనందభరితంగా చెప్పారు.
 
ఇక పద్మ అవార్డులు ఈమధ్య చాలామందికి వస్తున్నాయి. నాయికలు కూడా వస్తున్నాయి? అనే ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ సమాధానమిస్తూ,, వారిలో వున్న టాలెంట్ నాకు లేదు కాబోలు అంటూ చలోక్తి విసిరారు. ఏ అవార్డులకైనా ఓ కమిటీ వుంటుంది. ఆ కమిటీ ద్రుష్టిలో నేను పడలేదు. అసలు అవార్డుకోసం అప్లయి చేయాలని ఆలోచన కూడా తనకు లేదని తేల్చిచెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు!

KCR:కేసీఆర్ మిస్సింగ్.. బీజేపీ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ వైరల్

వ్యక్తిని తొండంతో లేపి విసిరేసిన ఏనుగు (Video)

డ్రైవింగ్ శిక్షణలో అపశృతి - తేరుకునేలోపు దూసుకెళ్లింది... (Video)

తెలంగాణలో 11 హెచ్ఎంపీవీ కేసులు.. 2024 డిసెంబరులోనే నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments