Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ‌ల్‌చ‌ల్ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ రాప్ సాంగ్

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (20:27 IST)
Rajendra Prasad, Climax movie
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని మనం ఎన్నో విభిన్నమైన పాత్రలలో చూసాం, తరించాం. అయన నటనతో ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలో తన నటన తో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటూ వచ్చారు. ఇంకా మరెన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారిని క్లైమాక్స్ అనే సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రలో చూడబోతున్నాము. క్లైమాక్స్ చిత్రం ట్రైలర్ చూసి ప్రేక్షకులు సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. 
 
అయితే క్లైమాక్స్ చిత్రంలో అద్భుతమైన పాత్ర చేస్తూ ఒక అందమైన రాప్ సాంగ్ కూడా పాడారు మన రాజేంద్ర ప్రసాద్ గారు. డబ్బులు లేకపోతే వచ్చే కష్టాలు చూసాము, మరి డబ్బులు ఎక్కువుంటే ఏలాంటి కష్టాలు వస్తాయో తెలుసుకోవాలి అంటే  మన రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగ్ రాప్ సాంగ్ చూడాల్సిందే. రాజేష్, నీద్వానా సమకూర్చిన పాటకి రాజేంద్ర ప్రసాద్ గారు తన గాత్రంతో ప్రాణం పోసారు. రాజేంద్ర ప్రసాద్ గారు పడిన లక్ష్మి వచ్చింది లిరికల్  రాప్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో హల్చల్  చేస్తుంది.
 
కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరో గా, సాషా  సింగ్, శ్రీ రెడ్డి, పృద్వి, శివ శంకర మాస్టర్, రమేష్ ముఖ్య తారాగణంతో భవాని శంకర్. కె. దర్శకత్వంలో కరుణాకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిలు నిర్మించిన చిత్రం "క్లైమాక్స్". ఈ చిత్రం ఈ నెల ఫిబ్రవరి 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments