Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోట‌శ్రీ‌నివాస‌రావు రూటులో రాజేంద్ర‌ప్ర‌సాద్‌

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (12:52 IST)
Rajendra Prasad
న‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ విభిన్న‌మైన పాత్ర‌లు పోషించారు. పిసినారిలో అత్యంత పిసినారి పాత్ర తెలుగువారికి గుర్తిండే పాత్ర కోట‌శ్రీ‌నివాస‌రావు చేసిందే. `అహ‌నా పెల్లంట‌`లో ఆయ‌న చేసిన పాత్ర తీరు అలాంటిది. బ‌ట్ట‌లు బ‌దులు పేప‌ర్ క‌ట్టుకోవ‌డం, అగ్గిపుల్ల‌లు ఏరి వంట వండ‌టంతోపాటు కోడిని ఎదురుగా వేలాడి తీసి ఉట్టి అన్నం తింటూ కోడికూర తిన్నంత‌గా తృప్తి చెందండం వంటివి ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేశాయి. స‌మాజంలో ఇంత పిసినారి వారు వుంటారా అనేది సింబాలిక్‌గా ద‌ర్శ‌కుడు జంథ్యాల చూపించారు. ఆ సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్ పిసినారి సంఘానికి అధ్య‌క్షునిగా న‌టించాడు. ఇప్పుడు ఆ సినిమాలో కోట పోషించిన పాత్ర రాజేంద్ర‌ప్ర‌సాద్ పోషిస్తే? ఎలా వుంటంద‌నే ట్విస్ట్ తో ఓ సినిమా రూపొందుతోంది. అదే `ఎఫ్‌3`.
 
ఎఫ్‌3ను ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి స‌రికొత్త‌గా ఆవిష్క‌రించే ప‌నిలో వున్నాడ‌ని స‌మాచారం. త‌న‌కు ఇష్ట‌మైన జంథ్యాల‌గారి బాట‌లో ఆయ‌న అనురిస్తున్నారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను అతి పిసినారిగా చూపించ‌బోతున్నాడ‌ట‌. న‌టుడిగా ఎవ్వ‌రూ చేయ‌న‌న్ని పాత్ర‌ల‌ను చేసిన ఘ‌నుడు రాజేంద్రప్ర‌సాద్ అందుకే ఆ పాత్ర‌ను చేయ‌డానికి చాలా ఆస‌క్తి చూపించాడు. ఆ పాత్ర‌కు విభిన్న‌మైన గెట‌ప్ కూడా వుంటుంది. క‌రోనా త‌ర్వాత ఆయ‌న పాత్ర ఎలా వుంటుంది? ఇత‌ర వివ‌రాలు ద‌ర్శ‌కుడు తెలియ‌జేనున్నారు.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments