షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

ఠాగూర్
సోమవారం, 8 డిశెంబరు 2025 (19:34 IST)
ఓ సినిమా షూటింగులో ప్రమాదం జరిగింది. ఇందులో హీరో డాక్టర్ రాజశేఖర్‌ కాలికి గాయమైంది. దీంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజశేఖర్ తమిళంలో విజయవంతమైన 'లబ్బర్ పందు' అనే సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు ఆయన కాలి చీలమండకు గాయమైంది. దీన్ని పరీక్షించిన వైద్యులు చీలమండలో క్రాక్స్ ఉన్నట్టు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత నాలుగు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. 
 
కాగా, రాజశేఖర్‌కు గాయం కావడంతో సినిమా షూటింగును తాత్కాలికంగా నిలిపివేశారు. చిత్రీకరణను తిరిగి వచ్చే యేడాది జనవరిలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటిస్తుండగా, రాజశేఖర్ కుమార్తె శివానీ హీరోయిన్‌ పాత్రను పోషిస్తోంది. దాదాపు 27 యేళ్ల తర్వాత రమ్యకృష్ణ ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన నటిస్తున్నారు. కాగా, ప్రమాద వార్త తెలిసిన కొందరు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శెభాష్ నాయుడు... క్లిష్ట సమయంలో మీ పనితీరు సూపర్ : ప్రధాని మోడీ కితాబు

ఆహా... ఏం రుచి... అమెరికాలో భారతీయ వంటకాలకు ఆదరణ

Davos: జనవరి 19 నుంచి జనవరి 23 వరకు చంద్రబాబు దావోస్ పర్యటన

మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్లను వద్దనే వద్దంటున్న కంపెనీ

తల్లి కళ్ళెదుటే ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments