Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hebba Patel: మూఢనమ్మకాలను, దొంగ బాబాలను టార్గెట్ తో ఈషా ట్రైలర్‌

Advertiesment
Akhil Raj, Trigun, Hebba Patel

దేవి

, సోమవారం, 8 డిశెంబరు 2025 (17:18 IST)
Akhil Raj, Trigun, Hebba Patel
దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్మే స్నేహితుల చుట్టూ ఈ కథతో ఈషా ట్రైలర్‌ ఉందని తెలియజేస్తున్నది. బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఈషా పేరుతో ఓహారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న  థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అఖిల్‌రాజ్‌,త్రిగుణ్‌ హీరోలుగా హెబ్బాపటేల్‌ కథానాయిక.  సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్నిహేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు.
 
తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. ఇప్పటి వరకు వచ్చిన రెగ్యులర్‌ హారర్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఇదొక ఆసక్తికరమైన పాయింట్‌తో అల్లుకున్న భయపెట్టే కథ అనిపిస్తుంది. రెగ్యులర్‌ హారర్‌ ఫార్ములాకు భిన్నంగా ఉండేలా కనిపిస్తుంది. మీరు ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది అని ట్రైలర్‌ మొదలు ఆసక్తికరంగా మొదలవుతుంది. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ప్రేక్షకలు ఉలిక్కిపడే ట్విస్ట్‌లు పుష్కలంగా ఉన్నాయనిపిస్తుంది. దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్మే స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను, దొంగ బాబాలను ఎక్స్ పోజ్ చేయడానికి బయలుదేరిన వీరికి, బాబ్లూ పృథ్వీరాజ్ రూపంలో ఒక సవాలు ఎదురవుతుంది. "ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే.." అంటూ ఆయన విసిరే ఛాలెంజ్ తో వీరు ఒక చీకటి ప్రపంచంలోకి అడుగుపెడతారు. సైన్స్ కు, అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే క్లాష్ దీన్ని ఆసక్తికరంగా మలిచారు.
 
ట్రైలర్ లోని విజువల్స్ చాలా వరకు బ్లూ అండ్ డార్క్ థీమ్ లో సాగాయి. ముఖ్యంగా ఆ పాడుబడిన బంగ్లా, అక్కడ నేల మీద వేసి ఉన్న యంత్రాలు, క్షుద్ర పూజల సెటప్ సినిమాలోని మూడ్ ని ఎలివేట్ చేశాయి. కెమెరామెన్ సంతోష్ లైటింగ్ వాడిన విధానం, దానికి ఆర్ఆర్ ధృవన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడై కొన్ని చోట్ల ఉలిక్కిపడేలా చేశాయి. సౌండ్ డిజైన్ హార్రర్ సినిమాలకు ఎంత ముఖ్యమో ఈ సినిమా సౌండ్‌ డిజైనింగ్‌ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుందేమో అనిపిస్తుంది. డిసెంబర్ 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ట్రైలర్ చివర్లో వచ్చే ట్విస్ట్ లు, ఫాస్ట్ కట్స్ సినిమా మీద ఒక క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేశాయి. ఒక పక్కా హార్రర్ థ్రిల్లర్ ను చూడాలనుకునే ప్రేక్షకులకు అంతకు మించి సమ్‌థింగ్‌ను ఈ సినిమా అందించబోతున్నాయని ట్రైలర్‌ చూసిన అందరూ అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో సుశాంత్‌తో మీనాక్షి చౌదరి రిలేషన్?