Webdunia - Bharat's app for daily news and videos

Install App

కథ సిద్ధం చేశానన్న డైరెక్టర్... ఎగిరి గంతేసిన జూనియర్ ఎన్టీఆర్?

జూనియర్ ఎన్ టిఆర్.నందమూరి కుటుంబంతో సినీరంగ ప్రవేశం చేసిన జూనియర్ ఎన్‌టిఆర్ ఆ తరువాత వెనుతిరిగి చూడనేలేదు. తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు జూనియర్ ఎన్‌టిఆర్. జూనియర్‌కు ఎన్ని హిట్లో.. అన్ని ఫ్లాప్‌లు కూడా ఉన్నాయి. ఈ

Webdunia
మంగళవారం, 30 మే 2017 (14:11 IST)
జూనియర్ ఎన్ టిఆర్ నందమూరి కుటుంబంతో సినీరంగ ప్రవేశం చేసిన జూనియర్ ఎన్‌టిఆర్ ఆ తరువాత వెనుతిరిగి చూడనేలేదు. తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు జూనియర్ ఎన్‌టిఆర్. జూనియర్‌కు ఎన్ని హిట్లో.. అన్ని ఫ్లాప్‌లు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు జూనియర్‌కు లేవు. దీంతో ఏం చేయాలో పాలుపోక.. ఒక దర్శకుడిని జూనియర్ పట్టుకున్నారట. ఆయనే రాజమౌళి. సింహాద్రి, యమదొంగతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ఇమేజ్‌ను తెచ్చిపెట్టారు రాజమౌళి. ఆ తరువాత రాజమౌళితో సినిమాలను తీయనేలేదు. జూనియర్‌కు అంతటి స్థాయిలో విజయాలు కూడా పెద్దగా లేవు.
 
బాహుబలి సినిమాల్లో బిజీగా ఉన్న రాజమౌళి ఆ తరువాత ఏ హీరోతో పెద్దగా మాట్లాడలేదు. వేరే సినిమాల వైపు ఆలోచన పెట్టలేదు. 5సంవత్సరాలు బాహుబలికే అంకితమైపోయారు. కానీ బాహుబలి సినిమా ఘూటింగ్ జరిగే సమయంలోనే జూనియర్ రాజమౌళిని చాలాసార్లు కలిసి సినిమా తీయమని రిక్వెస్ట్ చేశారట. అయితే తరువాత మాట్లాడదామని రాజమౌళి చెప్పడంతో జూనియర్ ఆ తరువాత కలువలేదు. 
 
కానీ బాహుబలి-2సినిమా విడుదలై రాజమౌళి ఫ్రీగా ఉండటంతో రెండురోజుల క్రితం రాజమౌళి ఇంటికి వెళ్ళిన జూనియర్ మరోసారి మాట్లాడారట. మీ కోసం కథను కూడా సిద్ధం చేశానని, త్వరలో సినిమా తీద్దామని జూనియర్‌కు చెప్పారట రాజమౌళి. దీంతో జూనియర్ ఎగిరి గంతేసే పనిచేసి చివరకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారట. జూనియర్ ఎన్‌టిఆర్, రాజమౌళి మధ్య వస్తున్న సినిమా అభిమానుల ఎక్పస్టేషన్‌ను మరింత పెంచే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి తొక్కిసలాట : క్రిమినల్స్ ముఠా నేతగా చంద్రబాబు : అంబటి రాంబాబు

12,500 మినీ గోకులాలు ప్రారంభించిన : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Video)

బెన్ఫిట్ షోలు రద్దు చేశారు సరే.. స్పెషల్ షో ప్రదర్శన ఏంటి : టీ హైకోర్టు ప్రశ్న

Pawan Kalyan: క్షమాపణ చెప్తే తప్పేంటి? అమ్మాయిల దగ్గర మగతనం చూపిస్తే నార తీస్తాం: పవన్ (video)

రోడ్డు నిర్మాణ పనులు - ప్రమాదస్థలిని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments