Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2 రికార్డు బద్దలైతే సంతోషిస్తా.. రాజమౌళి తండ్రి ట్విస్ట్

చిత్రసీమలో ఏదీ శాశ్వతం కాదని, నిన్నటి రికార్డు నేడు బద్దలయితే నేటి రికార్డు రేపు బద్దలు కావాలని, అలా అయితేనే చిత్ర పరిశ్రమ చల్లగా ఉంటుందని భారతీయ నంబర్ వన్ ఎపిక్ మూవీ బాహుబలి కథా రచయిత విజయేంద్రప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Webdunia
మంగళవారం, 9 మే 2017 (02:39 IST)
చిత్రసీమలో ఏదీ శాశ్వతం కాదని, నిన్నటి రికార్డు నేడు బద్దలయితే నేటి రికార్డు రేపు బద్దలు కావాలని, అలా అయితేనే చిత్ర పరిశ్రమ చల్లగా ఉంటుందని భారతీయ నంబర్ వన్ ఎపిక్ మూవీ బాహుబలి కథా రచయిత విజయేంద్రప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడేమూడు నెలల్లో భారతీయ చలన చిత్ర పరిశ్రమ కల్లో కూడా ఊహించిని గొప్ప కథ బాహుబలిని రాసి రాజమౌళికి అప్పగించిన విజయేంద్రప్రసాద్ తెలుగు చిత్ర పరిశ్రమను, భారతీయ చలన చిత్ర చరిత్రను మార్చేవేశారు. కథ, కథకు తగ్గ బడ్జెట్, టేకింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్, టెక్నీషియన్స్‌ వర్క్‌.. ఇవన్నీ బాగుంటే భాషతో సంబంధం లేకుండా అందరూ చూస్తారని బాహుబలి చిత్రం నిరూపించిందని పేర్కొన్నారు. బాహుబలిని మించిన సినిమా వస్తేనే, బాహుబలి-2 రికార్డులు బ్రేక్ అయితేనే సినీ పరిశ్రమ పచ్చగా ఉంటుందని అంటున్న విజయేంద్ర ప్రసాద్ బాహుబలి విశేషాలు గురించి చెబుతున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే విందాం..
 
వెయ్యి కోట్లకు నాంది పలికిన తొలి ఇండియన్‌ మూవీ మన తెలుగు సినిమా కావడం నాకయితే చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే హద్దులు చెరిపేసింది. కథ, కథకు తగ్గ బడ్జెట్, టేకింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్, టెక్నీషియన్స్‌ వర్క్‌.. ఇవన్నీ బాగుంటే భాషతో సంబంధం లేకుండా అందరూ చూస్తారని అర్థమైంది. కథ బాగుంటే సినిమా ఆదరణ పొందుతుందనే ధైర్యాన్ని ఇచ్చింది. బలమైన కథను నమ్మి, భారీగా ఖర్చు పెట్టవచ్చని నిరూపించింది.
 
ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. ఇవాళ ‘బాహుబలి’.. రేపు ఇంకోటి రావాలి. అప్పుడే బాగుంటుంది. పరిశ్రమ పచ్చగా ఉంటుంది. అసలుకు బాహుబలి కథ రాయడానికి పెద్దగా శ్రమించింది లేదు. 2012లో రాజమౌళి నాతో రాజుల కాలం నాటి సినిమా చేయాలని ఉందన్నాడు. క్యారెక్టర్స్‌ అన్నీ స్ట్రాంగ్‌గా ఉండాలన్నాడు. మంచి వ్యక్తిగా ఉంటూ పరిస్థితుల ప్రభావంతో చెడుగా మారే పాత్ర కూడా స్ట్రాంగ్‌గా ఉండాలన్నాడు. అప్పుడు కథ రాయడం మొదలుపెట్టాను. పాత్రలు ఊహించుకుని మూడే మూడు నెలల్లో కథ పూర్తి చేశాను. అన్ని కథలు రాసినట్లుగానే ఇది కూడా సునాయాసంగానే రాసేశాను. మనం ఏం రాయాలనే దాని మీద స్పష్టమైన అవగాహన ఉంటే రాయడం ఈజీ.
 
బాహుబలి భారీ సినిమా అవుతుందనుకున్నాను కానీ, ఈ స్థాయిని ఊహించలేదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనిలతో పోల్చుకుంటే నాకూ, రాజమౌళికి ఉన్న టెన్షన్‌ చాలా తక్కుప అనే చెప్పాలి. వందలకోట్ల రూపాయల బడ్జెట్‌ అంటే రిస్క్‌. కానీ, వాళ్ల ముఖాల్లో ఏ రోజూ నేను టెన్షన్‌ చూడలేదు. ఈ సినిమాకి వాళ్లే హీరోలు.
     
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments