Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఇద్దరివి భిన్నధృవాలు : పవన్ కళ్యాణ్‌పై రాజమౌళి!

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (12:08 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా తీసే విషయంపై దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. తమ ఇద్దరివీ భిన్నధృవాలు అంటూ వ్యాఖ్యానించారు. నిజానికి ఈ మధ్యకాలంలో రాజమౌళి వరుసగా యంగ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్ వంటి హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ టాలీవుడ్ పరిధి మరింతగా విస్తరిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో మెగా అభిమానులు రాజమౌళి, కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన రాజమౌళి పవన్‌తో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కాంబినేషన్‌లో ఇప్పటివరకు సినిమా ఎందుకు రాలేదు? ఎలాంటి ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండా ఉండటానికి గల కారణం ఏమిటి? అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
 
తాజాగా శ్రీకాకుళంలోని ఒక కాలేజ్ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన రాజమౌళి అక్కడ స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో భాగంగానే ఓ మెగా అభిమాని పవన్ కళ్యాణ్ తో మీ సినిమా ఎప్పుడు ఉంటుందని అడిగేశాడు. 
 
దీనికి రాజమౌళి స్పందించారు. 'పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడం కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేశాను. ఓసారి ఓ మూవీ షూటింగ్‌లో ఆయనను కలిసి మాట్లాడగా చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఆ సమయంలో మీతో సినిమా చేయాలని ఉంది ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నారు చెప్పండి అని అడిగాను. 
 
ఆయన ఎలాంటి సినిమా చేయడానికైనా రెడీ అని చెప్పారు. నేను కూడా కథ రెడీ చేసుకుని ఆయనకు చెప్పాలనుకున్నాను. కానీ ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి ఎలాంటి కబురూ రాలేదు. ఇక ఆయన వేరే సినిమాలు చేస్తూ బిజీ కావడంతో నేను కూడా మోర్ బిగ్గర్, వైడర్ సినిమాలు చేయాలనే ఆలోచనతో 'మగధీర', 'యమదొంగ' వంటి సినిమాలు చేశాను. 
 
పైగా, మా ఇద్దరి ఆలోచనలు కూడా మారిపోయాయి. ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువైంది. నేనేమో ఇటువైపు ఎక్కువ రోజులు సినిమాలకు కేటాయించాను. సో ఐ లవ్ హిమ్ ఎ లాట్… ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్… కాకపోతే మేము ఇద్దరం రెండు వేరు వేరు మార్గాలలో ప్రయాణిస్తున్నాం. మా ఇద్దరివి విభిన్నదారులు” అంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments