Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తార‌క్‌, చ‌ర‌ణ్‌పై తాజా విజువల్ గ్లింప్స్ ఆదివారం ఫిక్స్‌

Advertiesment
Rajamouli
Charan, ntr
రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న `రౌద్రం రణం రుధిరం` సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఇవ్వ‌నున్నారు. ఇందుకు నవంబర్ 1 న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్  ప్రకటించింది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి ఒక్కో స‌మాచారాన్ని ఒక్కోసంద‌ర్భంగా విడుద‌ల చేశారు. తాజాగా రేపు ఆదివారంనాడు విజువల్ ట్రీట్ ఇచ్చే గ్లింప్స్ (సంగ్రహావలోకనం) ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది.
 
రామ్‌చ‌ర‌న్‌, ఎన్‌.టి.ఆర్‌. పోస్ట‌ర్‌ను శ‌నివారంనాడు విడుద‌ల చేసి అందులో గ్లింప్స్ ఆఫ్ ఫ‌స్ట్ నెంబ‌ర్ అని తెలియ‌జేశారు. దీని నిడివి 45 సెకండ్ల‌పాటు వుంటుందని స్ప‌ష్టం చేసింది. ఇలా ఒక్కోక్క‌టి అభిమానుల‌కు రుచి చూపిస్తూ రేపు మ‌రింత ఆస‌క్తి క‌లిగించేవిధంగా తెలియ‌జేయ‌నున్నారు. ఈ సినిమా ప‌లు అంత‌ర్జాతీయ భాష‌ల‌తోపాటు ఇంగ్లీషులో కూడా విడుద‌ల‌చేసే విష‌యాన్ని కూడా రేపు ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పునీత్ రాజ్‌కుమార్ లైఫ్‌స్టోరీ: అప్పు సినిమాతో ఎంట్రీ ఇచ్చి..